For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగ్లాదేశ్ నుంచి పెరుగుతుంటే.. పాకిస్థాన్ నుంచి తగ్గుతున్నారు.. ఎందుకో తెలుసా?

|

రెండూ మనదేశానికి పొరుగు దేశాలే. ఈ రెండు దేశాల నుంచి మనదేశానికి పర్యాటకులు వస్తుంటారు. కానీ ఒక దేశం నుంచి వచ్చే పర్యాటకులు పెరుగుతుంటే.. మరో దేశం నుంచి వచ్చే పర్యాటకులు మాత్రం తగ్గుతున్నారు. ఆ రెండు దేశాలు బాంగ్లాదేశ్, పాకిస్థాన్ లు. మరో విషయం ఏమిటంటే మన దేశానికి ఎక్కువగా ఏ దేశం నుంచి పర్యాటకులు వస్తున్నారో తెలుసా? ఈ సమాధానం మీకు ఆశ్చర్యం కలిగించ వచ్చు. ఆ దేశం ఏమిటంటే బంగ్లాదేశ్. గత మూడేళ్ళ నుంచి ఈ దేశం నుంచి పర్యాటకుల రాక పెరుగుతోంది. అదే విధంగా పాకిస్థాన్ నుంచి పర్యాటకుల రాక తగ్గుతోంది. ఇందుకు ఈ దేశాలతో ఉన్న సంబంధాలు, సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు కారణం అవుతున్నాయి.

ఇదీ లెక్క

* పర్యాటక శాఖా సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లోక్ సభకు సమర్పించిన వివరాల ప్రకారం 2016 సంవత్సరంలో భారత్ కు 88 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారు.
* 2017 సంవత్సరంలో 1.05 కోట్లకు, 2018 సంవత్సరంలో 1. 056 కోట్లకు పెరిగింది.

భారీగా విదేశీ మారక నిల్వలు

* విదేశీ పర్యాటకులు రావడం వల్ల విదేశీ మారకం నిల్వలు పెరుగుతున్నాయి. పర్యాటకం ద్వారా విదేశీ మారక ద్రవ్య రాబడి 2016 సంవత్సరంలో 2,292 కోట్ల డాలర్లు ఉండగా, 2017 సంవత్సరంలో 2,731 కోట్ల డాలర్లకు, 2018 సంవత్సరంలో 2,858 కోట్ల డాలర్లకు పెరిగింది.

Foreign tourists arrival increasing from Bangladesh, decreasing from Pakistan

ఐదుగురిలో ఒకరు బంగ్లాదేశ్ నుంచి

* గత రెండేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే మనదేశానికి వచ్చిన ఐదుగురు విదేశీ పర్యాటకుల్లో ఒకరు బాంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే ఉన్నారు.

*2016 సంవత్సరంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విదేశీ పర్యాటకులు 13.8 లక్షలు ఉండగా 2017 సంవత్సరంలో 21.5 లక్షలకు, 2018 సంవత్సరంలో 22.5 లక్షలకు పెరిగారు.
* గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా నుంచి భారత్ కు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత మూడేళ్ళ కాలంలో చూస్తే పర్యాటకుల పరంగా అమెరికా రెండో స్థానంలో నిలిచింది.
* 2016 లో అమెరికా నుంచి భారత్ కు 12.7 లక్షల మంది పర్యాటకులు రాగా 2017 సంవత్సరంలో 13.7 లక్షలకు, 2018 సంవత్సరంలో 22.5 లక్షలకు పెరిగింది. పర్యాటకుల విషయంలో యూకే మూడో స్థానంలో ఉంది. ఉంది.

పాకిస్థాన్ నుంచి తగ్గుతున్నారు...

* 2016 సంవత్సరంలో పాకిస్థాన్ నుంచి భారత్ కు 1.04 లక్షల మంది పర్యాటకులు వచ్చారు. అయితే 2017 సంవత్సరంలో ఈ సంఖ్య 44,266 కు, 2018 లో 41,659కి తగ్గిపోయింది.

* మన దేశానికి 60 దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటే వారిలో అర్జెంటీనా వాటా చాలా తక్కువగా ఉంది.

భారత్ కు ఎక్కువగా పర్యాటకులు వస్తున్న టాప్ 10 దేశాలు

- బంగ్లాదేశ్
- అమెరికా
- యుకె
- కెనడా
- మలేషియా
- శ్రీలంక
- ఆస్ట్రేలియా
- జర్మనీ
- చైనా
- ఫ్రాన్స్

English summary

బంగ్లాదేశ్ నుంచి పెరుగుతుంటే.. పాకిస్థాన్ నుంచి తగ్గుతున్నారు.. ఎందుకో తెలుసా? | Foreign tourist's arrival increasing from Bangladesh, decreasing from Pakistan

Foreign tourist's arrival from neighbouring country Bangladesh has been increasing the last three years, and the number of arrivals from another neighbouring country pakistan has been declining. Bangladesh accounted number one in the foreign tourists list.
Story first published: Thursday, November 21, 2019, 21:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X