For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత బొగ్గుగనుల వేలంపై ఆసక్తి చూపని విదేశీ సంస్థలు ..40 శాతం గనులకు నో బిడ్డింగ్

|

దేశ వ్యాప్తంగా బొగ్గు గని కార్మిక సంఘాలు ఎంత ఆందోళన చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తామని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తూ వేలం ప్రకటించింది . అయితే ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి వేలం వేస్తున్న 38 బొగ్గు గనులలో 15 కి ప్రభుత్వం ఎటువంటి బిడ్లు పొందలేదు. పెట్టుబడిదారులు ఆసక్తి చూపలేదు. విదేశీ సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు .

ప్రైవేట్ భాగస్వామ్యం కోసం బొగ్గు గనుల వేలం

ప్రైవేట్ భాగస్వామ్యం కోసం బొగ్గు గనుల వేలం

పర్యావరణ ఆందోళనలు మరియు తక్కువ మార్జిన్లతో ఉండే ఈ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తే లాభాల బాటలో పయనిస్తుందని సర్కార్ భావించింది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద బొగ్గు వినియోగదారు, దిగుమతిదారు మరియు బొగ్గు ఉత్పత్తిదారు అయిన ఇండియా పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు దిగుమతులను తగ్గించడానికి అనేక రకాల ఆర్థిక ప్రోత్సాహకాలను అందించినా పెద్దగా ఎవరూ దృష్టి పెట్టలేదు . భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి ముఖ్యంగా ఎక్కువగా కోల్‌ ఇండియా లిమిటెడ్‌ నిర్వహిస్తుంది అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది ప్రైవేట్ భాగస్వామ్యం కోసం నిర్ణయం తీసుకున్నారు .

23 బొగ్గు గనులకు మొత్తం 76 బిడ్లు మాత్రమే ..15 గనులకు నో బిడ్డింగ్

23 బొగ్గు గనులకు మొత్తం 76 బిడ్లు మాత్రమే ..15 గనులకు నో బిడ్డింగ్

23 బొగ్గు గనులకు మొత్తం 76 బిడ్లు వచ్చాయి అని బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 38 గనులలో 19 గనులకు మాత్రమే రెండు లేదా అంతకంటే ఎక్కువ బిడ్లు వచ్చాయి. 15 గనులకు ఎవరూ ఆసక్తి చూపలేదు . బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ సమర్పించిన మొత్తం బిడ్లలో దాదాపు ఆరవ వంతు ఉంటుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్యూమినియం కంపెనీలు హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ అల్యూమినియం కో లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ మరియు జెఎస్డబ్ల్యు స్టీల్ లిమిటెడ్ పాల్గొన్న 42 కంపెనీలలో ఉన్నాయని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది.

40 శాతం గనులకు నో బిడ్డింగ్ .. ఆసక్తి చూపని విదేశీ సంస్థలు

40 శాతం గనులకు నో బిడ్డింగ్ .. ఆసక్తి చూపని విదేశీ సంస్థలు

బొగ్గు తవ్వకాలలో తక్కువ లేదా అనుభవం లేని కంపెనీలు, న్యూ ఢిల్లీకి చెందిన ఎన్డి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, బన్సాల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రిఫ్రిజెరాంట్ గ్యాస్ రీఫిల్లర్ రెఫెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా సాంకేతిక బిడ్లను సమర్పించాయి. విదేశీ సంస్థలు భారతీయ బొగ్గు గని వేలంపాటలను విరమించుకున్నట్టు కనిపిస్తుంది . ఇక మొత్తం వేలంలో ప్రతించిన గనులలో 40% గనులు ఎలాంటి బిడ్లు వెయ్యలేదు . పెట్టుబడికి ఆసక్తి చూపలేదు .

English summary

భారత బొగ్గుగనుల వేలంపై ఆసక్తి చూపని విదేశీ సంస్థలు ..40 శాతం గనులకు నో బిడ్డింగ్ | Foreign companies not interested in Indian coal auction..40percent no bidding for mines

Government has received no bids for 15 of 38 coal mines it is auctioning to attract private investment, reflecting little appetite for the sector clouded by environmental concerns and low margins. The world's second largest consumer, importer and producer of coal has offered a range of financial incentives to attract investment and reduce imports.
Story first published: Thursday, October 1, 2020, 18:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X