For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ford: భారత్‌లో నష్టం: ప్లాంట్ల ఎత్తివేత..అమెరికాలో 12 బిలియన్ డాలర్ల పెట్టుబడి

|

వాషింగ్టన్: భారత్‌లో తన ప్లాంట్లను మూసివేసిన టాప్ కార్ మేకర్స్ కంపెనీ ఫోర్డ్.. అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టబోతోన్నట్లు ప్రకటించింది. 11.4 బిలియన్ డాలర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేసే యూనిట్లను నెలకొల్పబోతోంది. మరో రెండు బ్యాటరీ పార్కులను ఏర్పాటు చేయబోతోంది. దీనివల్ల 11,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు ఫోర్డ్ తెలిపింది. 2030 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేసింది.

11.4 బిలియన్ డాలర్లతో టెన్నెస్సెలో కార్ల తయారీ యూనిట్లు, కెంటకీలో రెండు బ్యాటరీ తయారీ కేంద్రాలను నెలకొల్పుతామని పేర్కొంది. కార్లల్లో వినియోగించే బ్యాటరీల కోసమే కెంటకీలో ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. బ్యాటరీ సప్లయర్ ఎస్‌కే ఇన్నోవేషన్‌తో కలిసి 11.4 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది ఫోర్డ్ మోటార్స్. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌కే ఇన్నోవేషన్స్‌తో జాయింట్ వెంచర్‌గా ఏర్పడనుంది.

సెంట్రల్ కెంటకీలో ట్విన్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్లను నిర్మించనుంది. అలాగే టెన్నెస్సీలో 3600 ఎకరాల భారీ క్యాంపస్‌లో కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. , ఆటోమేకర్ సోమవారం రాత్రి చెప్పారు. ఇందులో బ్యాటరీ ప్లాంట్‌తో పాటు సప్లయర్ పార్క్, రీసైక్లింగ్ సెంటర్ ఉంటాయని ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫార్లే తెలిపారు. బ్యాటరీలతో సహా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచడానికి ఫోర్డ్ తాజా ప్రణాళికలను రూపొందించినట్లు జిమ్ చెప్పారు.

Ford has announced a major investment in electric vehicle production in the US

2030 నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని భావిస్తున్నామని, అప్పటి అవసరాలు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తమ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని పేర్కొన్నారు. కెంటకీలో నెలకొల్పబోతోన్న రెండు బ్యాటరీ పార్కుల్లో ఒకటి 2025 నాటికి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫోర్డ్ ప్రకారం, కెంటుకీలోని రెండవ బ్యాటరీ ప్లాంట్ 2026 లో ఆన్‌లైన్‌లో వస్తుందని భావిస్తున్నారు.

ఈ ప్లాంట్‌లో ఆల్-ఎలక్ట్రిక్ బాటమ్ అప్, ఆప్టిమైజ్డ్ ప్రొడక్ట్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించబోతున్నామని జిమ్ చెప్పారు. తమ కంపెనీ చరిత్రలో ఇది అతిపెద్ద ప్లాంట్ అవుతుందని వ్యాఖ్యానించారు. కాగా- భారత్‌లో రెండు కార్ల తయారీ ప్లాంట్లను మూసివేయబోతున్నామని ఫోర్డ్ ఇదివరక ప్రకటించిన విషయం తెలిసిందే. చెన్నై, గుజరాత్‌లోని సమంద్‌లో గల యూనిట్లను క్లోజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో అమెరికాలో భారీగా పెట్టుబడులను పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

English summary

Ford: భారత్‌లో నష్టం: ప్లాంట్ల ఎత్తివేత..అమెరికాలో 12 బిలియన్ డాలర్ల పెట్టుబడి | Ford has announced a major investment in electric vehicle production in the US

After closing the plants in India, Ford has announced a major investment in electric vehicle production in the US, promising to build its biggest ever factory in Tennessee, and two battery parks in Kentucky
Story first published: Tuesday, September 28, 2021, 16:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X