For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్ కాటు: త్వరలో ఆర్థిక ప్యాకేజీపై నిర్మల హామీ

|

కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన వివిధ రంగాల్ని ఆదుకునేందుకు త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ప్యాకేజీని ఎప్పటిలోగా ప్రకటిస్తారో త్వరలో వెల్లడించే అవకాశముంది. కరోనా వ్యాప్తితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం ఆమె పౌరవిమాయన, పశు సంవర్ధక, పర్యాటక, ఎంఎస్ఎంఈ.. 4 శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

భారత వృద్ధి రేటును 5.2 శాతానికి తగ్గించిన క్రిసిల్భారత వృద్ధి రేటును 5.2 శాతానికి తగ్గించిన క్రిసిల్

ఆర్థిక ప్యాకేజీ

ఆర్థిక ప్యాకేజీ

ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించామని, ఆయా శాఖల నుంచి తమకు వచ్చిన సూచనలను క్రోడీకరిస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించేందుకు ఆర్థికశాఖ శనివారం అంతర్గత సమావేశాన్ని నిర్వహిస్తుందన్నారు. ఆర్థిక ప్యాకేజీ ప్రకటనకు గడువును నిర్దేశించడం కష్టమని, సాధ్యమైనం త్వరగా ప్రకటిస్తామని చెప్పారు.

టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి..

టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి..

ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఇంకా ఏర్పాటు చేయలేదని, దీనిని అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొనే తాము భేటీని నిర్వహించినట్లు చెప్పారు. ప్రధాని మోడీ ప్రకటించిన కరోనా ఎకనమిక్ రెస్పాన్స్ టీమ్ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉందని చెప్పారు.

ఉపశమన చర్యలు..

ఉపశమన చర్యలు..

ఆర్థిక రంగానికి సంబంధించి ఉపశమన చర్యల గురించి మీడియా నుంచి ఎదురైన ప్రశ్నపై నిర్మల స్పందిస్తూ.. SEBI ప్రకటించిన నియంత్రణ చర్యలు మార్కెట్లలో కొంత స్థిరత్వాన్ని తీసుకు వస్తాయన్నారు. ప్రస్తుత స్థితిలో ప్రతీ ఒక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకుని వాటిపై పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్లు తెలిపారు.

English summary

కరోనా వైరస్ కాటు: త్వరలో ఆర్థిక ప్యాకేజీపై నిర్మల హామీ | FM Sitharaman takes stock of economic fallout of Coronavirus outbreak

Finance Minister Nirmala Sitharaman on Friday reviewed the economic fallout of the Covid-19 outbreak with the ministers and officials of civil aviation, MSME, tourism and animal husbandry to announce a package for the distressed sectors.
Story first published: Saturday, March 21, 2020, 16:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X