For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మోనెటైజేషన్ ప్లాన్ ఆవిష్కరించిన నిర్మలమ్మ

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం(ఆగస్ట్ 23) నేషనల్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ మోనెటైజేషన్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. రూ.6 లక్షల కోట్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మోనెటైజేషన్ ప్లాన్‌ను ప్రకటించారు. రైల్వే, రోడ్స్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల రంగాల నుంచి నిధుల సమీకరణ లక్ష్యంగా కేంద్రం జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్(NMP)ను ప్రకటించింది. వచ్చే నాలుగేళ్లలో ఈ కార్యక్రమం కింద రూ.6 లక్షల కోట్లను సమీకరించనుంది. ఈ మేరకు జాతీయ మోనెటైజేషన్ కార్యక్రమాన్ని నిర్మలమ్మ ప్రకటించారు. రైల్వే, రోడ్స్, విద్యుత్ రంగాల్లో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఆస్తులను మోనిటైజ్ చేయడం ద్వారా నిధులను సమీకరించనున్నట్లు తెలిపారు.

బ్రౌన్ ఫీల్డ్ ఆస్తులను మాత్రమే మోనెటైజ్ చేయనున్నామని, ఆస్తులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఆస్తులను విక్రయించడం లేదని, వాటిని నిర్ణీత గడువు తర్వాత వెనక్కి తీసుకుంటామన్నారు. 2021-22 బడ్జెట్ ప్రసంగంలో మోనెటైజేషన్ గురించి నిర్మలమ్మ ప్రస్తావించారు. ఇప్పుడు ఆ ప్రణాళికను ప్రకటించారు. FY25 నాటికి గరిష్ట మోనిటైజేషన్ రోడ్ రంగం నుండి వస్తుందని భావిస్తోంది. NHAI కింద ఉన్న రూ.1.6 లక్షల కోట్ల జాతీయ రహదారులు ఉన్నాయి.

FM Nirmala Sitharaman launches national infrastructure monetization plan

రోడ్ రంగం తర్వాత రైల్వే రంగంలో 400 స్టేషన్లు, 150కి పైగా రైళ్లు, పలు ట్రాక్స్ వ్యాల్యూ రూ.1.5 లక్షల కోట్లుగా నమోదయింది. పవర్ సెక్టార్ కింద రూ.67,000 కోట్ల ట్రాన్స్‌మిషన్ లైన్స్ ఉన్నాయి. హైడ్రో, సోలార్, విండ్ ప్రాజెక్ట్‌కు చెందిన 32,000 కోట్లు వ్యాల్యూ ఉంది.

English summary

నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మోనెటైజేషన్ ప్లాన్ ఆవిష్కరించిన నిర్మలమ్మ | FM Nirmala Sitharaman launches national infrastructure monetization plan

FM Nirmala Sitharaman will launch the National Monetisation Pipeline (NMP) at New Delhi on August 23.
Story first published: Monday, August 23, 2021, 19:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X