For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు

|

కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. సభ్యుల కోసం యూనియన్‌ బడ్జెట్ మొబైల్ యాప్‌ను శనివారం ఆవిష్కరించారు. దీని ద్వారా 14 యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్ల పూర్తి వివరాల్లోకి వెళ్లవచ్చు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది.

కరోనా నేపథ్యంలో పార్లమెంటు సభ్యులకు, ఇతరులకి ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వడం సరికాదని భావిస్తూ, మొదటిసారి పేపర్-లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. 1947 నవంబర్ 26న దేశంలో తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. నాటి నుండి ఎంపీలు సహా అందరికీ ఆర్థిక బిల్లు, కొత్త పన్నుల వివరాలు, నిర్ణయాలుసహా కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల సమాచారం మొత్తం డాక్యుమెంట్స్ రూపంలో అందిస్తూ వస్తున్నారు. ఈసారి కరోనా వల్ల ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది.

FM Nirmala launches Union Budget mobile app

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం గం.11 సమయానికి బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించనున్నారు. కరోనా నేపథ్యంలో నిర్మలమ్మ స్వతంత్ర భారతంలోనే సవాల్‌తో కూడిన బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు.

English summary

బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు | FM Nirmala launches Union Budget mobile app

Finance minister Nirmala Sitharaman launched the Union Budget mobile app on Saturday, even as final stages of FY 2021-22 Budget preparation began with the Halwa ceremony.
Story first published: Sunday, January 24, 2021, 17:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X