For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొగ్గు తవ్వకాలు, మౌలిక వసతులకు రూ.50వేల కోట్లు

|

రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (మే 16) 8 రంగాలకు ప్యాకేజీ ప్రకటించారు. బొగ్గు, ఖనిజం, రక్షణ ఉత్పత్తులు, ఎయిర్ స్పేస్ మేనేజ్‌మెంట్, ఎంఆర్ఓ, ఎయిర్ పోర్ట్స్ (సివిల్ ఏవియేషన్), స్పేస్, కేంద్రపాలిత ప్రాంతాల్లో పవర్ డిస్ట్రిబ్యూషన్, అటామిక్ ఎనర్జీ రంగాలపై ప్రకటన చేశారు. టెక్నాలజీ ద్వారా బొగ్గును వాయువుగా మార్చే వారికి ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు.

 5 లక్షల ఎకరాలు సిద్ధం, ప్రజల జేబుల్లోకి నేరుగా నగదు: నిర్మల సీతారామన్ 5 లక్షల ఎకరాలు సిద్ధం, ప్రజల జేబుల్లోకి నేరుగా నగదు: నిర్మల సీతారామన్

బొగ్గు తవ్వకాలు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఆర్థికమంత్రి. గతంలో బొగ్గు, విద్యుత్ సరఫరా లేక చాలామంది పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లారని గుర్తు చేశారు. బాక్సైట్, బొగ్గు రెండు కలిపి కేటాయిస్తే పెట్టుబడులకు అవకాశముంటుందన్నారు. కొత్త బొగ్గు గనులు కనుగొనేందుకు నిరంతర ప్రయత్నాలు ఉంటాయన్నారు. బొగ్గు ఉత్పత్తికి కొత్తగా 500 బ్లాకులు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రభుత్వం ఆదాయ భాగస్వామ్య విధానం ద్వారా బొగ్గు రంగంలో పోటీ, పారదర్శకత, ప్రయివేటురంగ భాగస్వామ్యాన్ని ప్రవేశ పెడుతుందన్నారు.

FM announces commercial mining of coal on revenue sharing basis

గనుల రంగంలో సరళీకృత విధానాలు తీసుకు వస్తామన్నారు. మైనింగ్ లీజు సమయంలో విధించే స్టాంప్ డ్యూటీని హేతుబద్దీకరిస్తామన్నారు. పాక్షికంగా వినియోగించిన గనులు వేరే వారికి బదలీ చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. బొగ్గు, బాక్సైట్ సంయుక్తంగా వేలం నిర్వహిస్తామన్నారు. బొగ్గు లేకుండా అల్యూమినియం ఉత్పత్తి కాదని చెప్పారు. అల్యూమినియం ఉత్పత్తిదారులకు తగినంత బొగ్గు, బాక్సైట్ కలిపి కేటాయిస్తామన్నారు.

English summary

బొగ్గు తవ్వకాలు, మౌలిక వసతులకు రూ.50వేల కోట్లు | FM announces commercial mining of coal on revenue sharing basis

Government will introduce competition, transparency, and private sector participation in the Coal Sector through revenue sharing mechanism instead of the regime of fixed rupee/tonne.
Story first published: Saturday, May 16, 2020, 17:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X