For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్‌కార్ట్ నష్టాలు రూ.3,837 కోట్లు, 40 శాతం పెరిగిన నష్టాలు

|

వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నష్టాలు పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. 2018-19లో రూ.3,836.8 కోట్ల నష్టాన్ని ఫ్లిప్‌కార్ట్ మూటగట్టుకుంది. 2017-18 ఏడాదిలో నష్టం రూ.2,063.8 కోట్లుగా ఉంది. నష్టం 85.91 శాతం పెరిగిందని కార్పోరేట్ వ్యవహారాల శాఖకు వెల్లడించింది.

కార్యకలాపాలపై ఆదాయం రూ.21,657.7 కోట్ల నుంచి 42.82 శాతం వృద్ధితో రూ.30,931 కోట్లకు చేరుకుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ సేవలను ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ నష్టాలు నష్టాలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,624 కోట్లుగా ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం కంటే ఈ నష్టాలు 40 శాతం ఎక్కువ.

<strong>అమెజాన్ నష్టం రూ.5,685 కోట్లు, అమెజాన్‌పే నష్టం రూ.1,160 కోట్లు</strong>అమెజాన్ నష్టం రూ.5,685 కోట్లు, అమెజాన్‌పే నష్టం రూ.1,160 కోట్లు

Flipkart e commerce arm records 40% hike in losses to Rs 1,624 Crore

ఫ్లిప్‌కార్ట్ ఆపరేషన్స్ కాస్ట్ 51 శాతం పెరిగాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.4,234 కోట్లుగా ఉంది. కాగా, అమెజాన్ ఇండియా నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,685 కోట్లుగా నమోదయ్యాయి.

2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.6,287 కోట్ల నష్టం కాగా, ఈ ఏడాది 9.5 శాతం తగ్గింది. అదే సమయంలో ఆదాయం 55 శాతం వృద్ధితో రూ.7,778 కోట్లకు చేరుకుంది. ఈ మేరకు బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం టోప్లర్ తెలిపింది. లాభాల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఆదాయంలో మాత్రం ఊరట లభించింది.

English summary

ఫ్లిప్‌కార్ట్ నష్టాలు రూ.3,837 కోట్లు, 40 శాతం పెరిగిన నష్టాలు | Flipkart e commerce arm records 40% hike in losses to Rs 1,624 Crore

After grabbing the eyeballs in the festive season for record sales, Flipkart again hits the headlines with its financial performance in year ending March 2019. Unsurprisingly, the e-commerce giant has once again reported a significant rise in both losses and revenue.
Story first published: Tuesday, October 29, 2019, 9:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X