కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్ సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారత్ రుణ రేటింగ్‌ను తగ్గించింది. మరో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ గురువారం ఇండియా స్థిరత్వం నుండి నెగిటివ్‌కు సవరించింది. కరోనా వైరస్ - లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపిందని పేర్కొంది. ఇప్పటికే రుణభారం కలిగిన వారిని కరోనా మరింతగా దెబ్బతీసింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 22 ఏళ్లలో తొలిసారి భారత్ రుణ రేటింగ్‌ను Baa2కు తగ్గించింది.

2022లో 9.5 శాతానికి
రేటింగ్ ఏజెన్సీ భారత్ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్)ను స్టేబుల్ నుండి నెగిటివ్ రేటింగ్ బీబీబీ-కు మార్చింది. మార్చి 25వ తేదీ నుండి విధించిన లాక్ డౌన్ కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఐదు శాతం క్షీణించే అవకాశముందని, అదే సమయంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతానికి పుంజుకోవచ్చునని అంచనా వేసింది. కరోనా భారత వృద్ధి దృక్పథాన్ని గణనీయంగా బలహీనపరిచిందని, అధిక రుణభారాన్ని బహిర్గతం చేసిందని పేర్కొంది.

ముందే మందగమనం
కరోనా మహమ్మారి కంటే ముందే మందగమనం కారణంగా భారత్‌లో వివిధ రంగాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఐతే బ్యాంకింగ్ రంగంలో అంతకుముందు కంటే రుణ భారం తగ్గింది. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఎల్ (నాన్ ఫర్ఫార్మింగ్ లోన్) రేషియో రెండేళ్ల క్రితం 11.6 శాతం ఉండగా, 2020 ఆర్థిక సంవత్సరంలో 9.0కు తగ్గిందని ఫిచ్ రేటింగ్ అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణంగా ప్రభుత్వం మూలధనం ఇంజెక్ట్ చేయడమే కారణమని పేర్కొంది.

రుణ రేటు భారీగా పెరగనుందన్న ఫిచ్ రేటింగ్
మందగమనం, కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిందని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణ రేటు 84.5 శాతానికి పెరుగుతుందని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. ఇది 2020 ఆర్థిక సంవత్సరంలో 71.0 శాతంగా ఉంది. కరోనా కారణంగా వివిధ కారణాలతో సంస్థలు దెబ్బతినడం, బ్యాంకులకు సవాళ్లు, ఎన్బీఎఫ్‌సీలకు లిక్విడిటీ ఈష్యూ వంటి వివిధ కారణాలతో జీడీపీ వృద్ధి రేటు ప్రతికూలంగా ఉంటుందని అంచనా వేసింది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications