For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యా సావరీన్ రేటింగ్‌ను భారీగా తగ్గించిన ఫిచ్, మూడీస్

|

ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, మూడీస్ తాజాగా రష్యా సావరీన్ రేటింగ్‌ను తగ్గించాయి. ఆరుస్థాయిల మేర జంక్ స్థితికి తగ్గించాయి. పాశ్చాత్య ఆంక్షలు రుణాన్ని అందించే దాని సామర్థ్యాన్ని సందేహానికి గురి చేశాయని, ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తాయని పేర్కొంది. ఉక్రెయిన్ పైన దాడి నేపథ్యంలో వివిధ దేశాల ఆంక్షల అనంతరం రష్యా ఆర్థిక మార్కెట్లు గందరగోళంలో ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ యూరోపియన్ దేశంపై ఇది అతిపెద్ద దాడి.

దండయాత్ర నేపథ్యంలో క్రెడిట్ రేటింగ్ కదలికలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం గురించి హెచ్చరికలను జారీ చేస్తున్నాయి. ఎస్ అండ్ పీ కూడా గతవారం రష్యా రేటింగ్‌ను జంక్ స్థాయికి తగ్గించాయి. ఫిచ్ రేటింగ్ రష్యాను బీబీబీ నుండి బీకి, మూడీస్ రేటింగ్‌ను బీఏఏ3 నుండి బీ3కి తగ్గించింది.

Fitch, Moodys slash Russias sovereign rating to junk status

1997లో ఒక సావరీన్ కంట్రీపై (సౌత్ కొరియా) ఇంతస్థాయిలో అంటే ఆరు స్థాయిల మేర డౌన్ గ్రేడ్ చేసినట్లు ఫిచ్ వెల్లడించింది. ఉక్రెయిన్ పైన రష్యా సైనిక దండయాత్రకు ప్రతిస్పందనగా అంతర్జాతీయ ఆంక్షల తీవ్రత స్థూల-ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలను పెంచిందని, రష్యా క్రెడిట్ ఫండమెంటల్స్‌కు భారీ షాకిచ్చిందని ఫిచ్ తెలిపింది.

English summary

రష్యా సావరీన్ రేటింగ్‌ను భారీగా తగ్గించిన ఫిచ్, మూడీస్ | Fitch, Moody's slash Russia's sovereign rating to junk status

Ratings agencies Fitch and Moody's downgraded Russia by six notches to "junk" status, saying Western sanctions threw into doubt its ability to service debt and would weaken the economy.
Story first published: Thursday, March 3, 2022, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X