For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani News: అదానీకి రెండు శుభవార్తలు.. కష్టకాలంలో ఊహించని సాయం..ఇన్వెస్టర్లకు కీలకం

|

Adani News: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వల్ల నష్టపోయిన అదానీ గ్రూప్ కు పెద్ద శుభవార్త ఉంది. ఇది సునామీలా అదానీ కంపెనీల వ్యాపారాలకు ఉన్న పేరును మసకబారుస్తోంది. చాలా అంతర్జాతీయ బ్యాంకులు సైతం అదానీ కంపెనీలకు దూరంగా జరగటం ప్రారంభించాయి.

అదానీ గ్రూప్ కు ఊరట..

అదానీ గ్రూప్ కు ఊరట..

ఏ కంపెనీకైనా ముందుగా చాలా కీలకం అంతర్జాతీయ లేదా దేశీయ సంస్థలు అందించే రేటింగ్. అయితే తాజాగా ఫిచ్ రేటింగ్స్, మూడీస్ సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీల విషయంలో తమ ప్రకటనలను విడుదల చేశాయి. షేర్ల కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించాయి. రేటింగ్ మార్పుకు ముందు ప్రతి అంశాన్ని అధ్యయనం చేస్తామని.. ఆ తర్వాతే నిర్ణయాలు ఉంటాయని ప్రకటించాయి.

రేటింగ్ పై క్లారిటీ..

రేటింగ్ పై క్లారిటీ..

తాజా పరిణామాలపై స్పందించిన రేటింగ్ సంస్థ ఫిచ్ అదానీ గ్రూపం కంపెనీల షేర్ల రేటింగ్ పై తక్షణ ప్రభావం ఉందని ప్రకటించింది. తాము అంచనా వేసిన నగదు ప్రవాహాల్లో పెద్ద మార్పులేమీ ఉండవని పేర్కొంది. తక్షణ రేటింగ్ మార్పులకు ఉపక్రమించబోమని చెప్పకనే చెప్పింది. అయితే సమయానుగుణంగా రానున్న కాలంలో రేటింగ్ విషయంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మూడీస్ మాట ఇదే..

మూడీస్ మాట ఇదే..

మరో ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా అదానీ సంస్థల విషయంలో ఒక ఊరటను ఇచ్చే ప్రకటన చేసింది. హిండెన్ బర్గ్ నివేదిక వల్ల ఏర్పడిన గందరగోళంలో ఈ అంచనాలు వస్తున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక నుంచి ఉత్పన్నమయ్యే క్లిష్ట పరిస్థితుల్లో అదానీ గ్రూప్ కంపెనీలు తమ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడానికి ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు నిధులను సేకరించడం కష్టమని మూడీస్ తెలిపింది. మూలధన వ్యయం లేదా రుణ చెల్లింపుల కోసం అదానీ గ్రూప్‌కు నిధులు అవసరమని రేటింగ్ సంస్థ చెప్పుకొచ్చింది.

ఉదయం అలా.. సాయంత్రం ఇలా..

ఉదయం అలా.. సాయంత్రం ఇలా..

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఉదయం 25 శాతానికి పైగా పతనం కాగా.. సాయంత్రానికి తిగిరి పుంజుకుంది. ఎన్ఎస్ఈలో సాయంత్రం కేవలం 2.19 శాతం నష్టంతో స్టాక్ రూ.1,531 రేటు వద్ద క్లోజ్ అయ్యింది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో స్టాక్ అత్యల్పమైన రూ.1,017.45 స్థాయికి తాకింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అదానీ గ్రూప్ పై స్పందిస్తూ.. స్వతంత్ర ప్రైవేట్ కంపెనీ గ్రూప్ కాబట్టి దానిపై ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది.

Read more about: fitch moodys adani group hindenberg
English summary

Adani News: అదానీకి రెండు శుభవార్తలు.. కష్టకాలంలో ఊహించని సాయం..ఇన్వెస్టర్లకు కీలకం | Fitch, moody's rating agencies made positive statements on Adani Group

Fitch, moody's rating agencies made positive statements on Adani Group
Story first published: Friday, February 3, 2023, 17:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X