For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fitch: భారత సార్వభౌమ రేటింగ్‌పై ఫిచ్ ఔట్‌లుక్.. ఏమార్పు లేకుండానే మరోసారి..

|

Fitch: భారత సావరిన్ రేటింగ్ ను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ ఏమాత్రం మార్చలేదు. బలమైన వృద్ధి మరియు అదుపులోని బాహ్య ఫైనాన్స్‌ల ఆధారంగా దేశ రేటింగ్‌ ను 'BBB-' వద్ద స్థిరంగా ఉందని ధృవీకరించింది. అయితే బలహీనమైన పబ్లిక్ ఫైనాన్స్‌ మాత్రం సవాలుగా ఉన్నట్లు పేర్కొంది. ఆగస్టు 2006 నుంచి అత్యల్ప ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ అయిన 'BBB-' వద్ద నుంచి ఇండియా రేటింగ్ మారక పోవడం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2023-మార్చి 2024) ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సార్వభౌమాధికార దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో 7 మరియు 2024-25లో 6.7 శాతం వృద్ధిని ఏజెన్సీ ఆశిస్తున్నట్లు చెప్పింది. సహచర దేశాలతో పోలిస్తే బలమైన వృద్ధి దృక్పథం వల్ల భారత్ రేటింగ్ మార్పులకు గురికాలేదని వెల్లడించింది.

Fitch continue stable BBB- on Indias sovereign rating

బలహీనమైన పబ్లిక్ ఫైనాన్స్‌, కొన్ని దేశాల కంటే అధిక లోటు మరియు అప్పులు.. ఇండియా ఎదుర్కొంటున్న ఇబ్బందులని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. వీటికి తోడు ప్రపంచ బ్యాంక్ గవర్నెన్స్ ఇండికేటర్‌లు మరియు తలసరి GDPలోనూ వెనుకబడినట్లు సూచికలు వెల్లడిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచంలోని మూడు ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, S&P మరియు మూడీస్ సైతం స్థిరమైన దృక్పథంతో ఇండియాపై అత్యల్ప పెట్టుబడి గ్రేడ్ రేటింగ్ కలిగి ఉండటం విశేషం.

పెరిగిన ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మరియు అంతర్జాతీయంగా తగ్గిన మార్కెట్ డిమాండ్‌తో పాటు కరోనా ప్రభావం భారత్ ఎదుగుదలకు అడ్డుగోడలుగా ఉన్నట్లు ఫిచ్ పేర్కొంది. అయితే ప్రభుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డ్రైవ్‌ తో పాటు కొన్నేళ్లుగా కార్పొరేట్ మరియు బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లలోనూ మెరుగుదల నమోదైంది. ఈ కారణంగా ప్రైవేట్ రంగం పెట్టుబడులను ఆకర్షిస్తూ, బలమైన వృద్ధికి సిద్ధంగా ఉన్నందని తెలిపింది. తద్వారా వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వివరించింది.

Read more about: fitch external debt
English summary

Fitch: భారత సార్వభౌమ రేటింగ్‌పై ఫిచ్ ఔట్‌లుక్.. ఏమార్పు లేకుండానే మరోసారి.. | Fitch continue stable "BBB-" on India's sovereign rating

Fitch continue stable "BBB-" on India's sovereign rating
Story first published: Wednesday, May 10, 2023, 7:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X