For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లి @రూ.80: ఏపీలో రాయితీపై రూ.25కే, ధర పెరిగినా హైద్రాబాద్‌లో అంతే!

|

ఉల్లి ధరలు వినియోగదారులను భయపెడుతున్నాయి. దీంతో ధరల నుంచి ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ నెల నుంచి ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆ తర్వాత కేంద్రం చర్యలతో కొంత తగ్గుముఖం పట్టినా, ఆ తర్వాత మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. రెండ్రోజుల్లో మొదటి లోడ్ రానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి.

ఆధార్ అప్‌డేట్ చేయాలా:పేరు, జెండర్, బర్త్ డేలపై కీలకమార్పులుఆధార్ అప్‌డేట్ చేయాలా:పేరు, జెండర్, బర్త్ డేలపై కీలకమార్పులు

మూడు రెట్లు పెరిగిన ధర

మూడు రెట్లు పెరిగిన ధర

శనివారం హైదరాబాదులోని మలక్‌పేట్ మార్కెట్లో ఉల్లి ధర టోకు క్వింటాల్ రూ.6వేలకు చేరుకుంది. గత నెలలో గరిష్టంగా క్వింటాల్ ధర రూ.1,971గా ఉంది. ఇప్పుడు ఏకంగా మూడు రెట్లకు పైగా పెరిగింది. ఏమాత్రం నాణ్యత లేని ఉల్లి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాదుకు మహారాష్ట్ర నుంచి వచ్చే నాణ్యమైన ఉల్లి ధర రూ.60గా ఉంది. దేశవ్యాప్తంగా చిల్లర ధర రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది.

రూ.80 వరకు పెరిగిన ధర

రూ.80 వరకు పెరిగిన ధర

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఉల్లి రిటైల్ ధర రూ.80 వరకు చేరుకుందని ఎన్‌హెచ్‌బీ నివేదిక తెలిపింది. ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్రం దిగుమతికి అనుమతివ్వడంతో పాటు నిల్వకు నాణ్యత ప్రమాణాలను సడలించింది. ఈ ఏడాదిలో ఖరీఫ్‌లో వర్షాలు, వరదల వల్ల ఉల్లి పంట దెబ్బతిన్నది. దీంతో 10 లక్షల టన్నుల వరకు దిగుబడి తగ్గుతుందని అంచనా.

రాయితీపై రూ.25కే ఉల్లి

రాయితీపై రూ.25కే ఉల్లి

మరోవైపు ఉల్లి ధరల స్థిరీకరణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్నూలులో వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 673 మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. రాష్ట్రంలోని 85 రైతు బజార్లలో సహాయ బృందాల ద్వారా కిలో రూ.25కు రాయితీపై ఉల్లిని సరఫరా చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.

పెరిగినా డిమాండ్ తగ్గని ఉల్లి.. ఏ నగరంలో ధర ఎంతంటే?

పెరిగినా డిమాండ్ తగ్గని ఉల్లి.. ఏ నగరంలో ధర ఎంతంటే?

ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ హైదరాబాదులో డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అక్టోబర్ నెలలో ఉల్లి ధరలు పెరిగినప్పటికీ అంతకుముందు ఏడాదుల్లోని అదే నెలలో వచ్చిన ఉల్లి కంటే ఎక్కువగా దిగుమతి చేసుకున్నారు. నవంబర్ నెలలో ఏకంగా మూడు రెట్లు పెరిగింది. ఆయా నగరాల్లో కిలో ఉల్లి ధరలు ఇలా ఉన్నాయి... ముంబై, ఢిల్లీలలో రూ.80 వరకు, చెన్నై, పాట్నాలో రూ.70, బెంగళూరు, హైదరాబాదులో రూ.60 ఉన్నాయి. నాసిక్‌లో రూ.50 వరకు ఉంది.

English summary

ఉల్లి @రూ.80: ఏపీలో రాయితీపై రూ.25కే, ధర పెరిగినా హైద్రాబాద్‌లో అంతే! | First consignment of onion to arrive from Egypt Tuesday

The Maharashtra State Consumer Dispute Redressal Commission has directed the Export Credit Guarantee Corporation of India (ECGCI) to pay over Rs 54 lakh to an onion exporter for deficiency in service.
Story first published: Sunday, November 17, 2019, 13:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X