For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Loan Apps: రోజురోజుకూ పెరుగుతున్న లోన్ యాప్ వేధింపులు.. ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు..

|

Loan Apps: లోన్ యాప్స్ విషయంలో కేంద్ర ఆర్ధిక కేంద్ర నిర్మలాసీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో తాజాగా లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. దేశం బయటి నుంచి ఈ వ్యాపారం చేస్తున్న, వారికి సహకారం చేస్తున్న భారతీయులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు రాజ్యసభలో ఆర్థిక మంత్రి వెల్లడించారు.

చైనా లోన్ యాప్స్..

చైనా లోన్ యాప్స్..

ప్రస్తుతం దేశంలో ఉన్న చాలా సందేహాస్పద యాప్స్ ఒక దేశం నుంచే పుట్టినట్లు ఆమె పరోక్షంగా చైనా యాప్స్ గురించి ప్రస్తావించారు. వీటి ఫలితంగా చాలా మంది లోన్స్ తీసుకున్న వారు వేధింపులకు గురవుతున్నారని ఆమె అన్నారు. ప్రజలు దోపిడీకి గురవుతున్నారని ఒక ప్రశ్నకు బదులిస్తూ వెల్లడించారు. రుణాలు ఇవ్వడంలో ఆర్‌బిఐ మార్గదర్శకాలను పాటించని చైనా సంస్థల మద్దతుతో సందేహాస్పద డిజిటల్ లోన్ యాప్‌ల నివేదికల గురించి మంత్రిని అడిగారు.

 తెలంగాణలో చర్యలు..

తెలంగాణలో చర్యలు..

ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోమ్‌తో సహా మరికొన్ని విభాగాలు నిరంతరం చర్చిస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కేసులపై చర్య తీసుకునేలా చూసేందుకు కృషి చేస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. కేవలం రెండు నెలల క్రితమే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా మందిని వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకున్నారని, మరెక్కడా చర్యలు తీసుకోవడం లేదని చెప్పడం లేదని ఆమె అన్నారు.

 రంగంలోకి RBI:

రంగంలోకి RBI:

డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం సెంట్రల్ బ్యాంక్ త్వరలో రెగ్యులేటరీ ఆర్కిటెక్చర్‌తో ముందుకు వస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల వెల్లడించారు. దేశంలోని చాలా డిజిటల్ లెండింగ్ యాప్‌లు సెంట్రల్ బ్యాంక్‌లో రిజిస్టర్ చేసుకోకుండానే తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి. దీంతో రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగుతోంది.

English summary

Loan Apps: రోజురోజుకూ పెరుగుతున్న లోన్ యాప్ వేధింపులు.. ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు.. | finance minister nirmala sitharaman comments over fake loan apps harasments

nirmala sitharaman comments over fake loan apps
Story first published: Tuesday, August 2, 2022, 19:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X