For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Kisan: రైతులకు అలర్ట్.. వెంటనే ఆ పని పూర్తి చేయండి.. లేకుంటే డబ్బులు రావు..

|

రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019లో కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా.. అన్నదాతలకు సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు. ఈ రూ.6 వేలను మూడు మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు 12 విడతలు రైతుల ఖాతాలో జమకాగా, తదుపరి విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

13వ విడత

13వ విడత

13వ విడత త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.పలు మీడియా నివేదికల ప్రకారం, రైతులకు నూతన సంవత్సర కానుకగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత కోసం కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలను బదిలీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు.

e-KYC

e-KYC

అయితే ప్రధాన మంత్రి కిసాన్ యోజన ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులైన రైతులు తప్పనిసారిగా e-KYC చేసుకోవాలి. కొంత మంది రైతులు ఇప్పటికీ e-KYC చేసుకోలేదు. e-KYC లేని రైతులకు 12 విడత డబ్బులు కూడా రాలేదు. వారు ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోకుంటే 13 విడత డబ్బులు కూడా రావని అధికారులు చెబుతున్నారు.

e-KYC ఇలా చేసుకోండి

e-KYC ఇలా చేసుకోండి

- ముందుగా PM కిసాన్ యోజన pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి

- వెబ్‌సైట్ కుడి వైపున ఇవ్వబడిన e-KYC ఎంపికపై క్లిక్ చేయండి.

-ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

-ఈ OTP మీ రిజిస్టర్డ్ నంబర్‌కు వచ్చిన తర్వాత, దాన్ని నమోదు చేయండి.

- ఆపై 'సమర్పించు'పై క్లిక్ చేయండి. అప్పుడు e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.

అనర్హులు

అనర్హులు

కాగా చాలా అనర్హులు ఈ పథకం కింద లబ్ధీ పొందినట్లు అధికారులు తెలిపారు. వారిని గుర్తించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా అబ్ధి పొందిన అనర్హులు ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్ కామ్ ట్యాక్స్ కట్టే వారు అనర్హులు. కానీ తెలంగాణలో ఇచ్చే రైతు బంధుకు ఇలాంటి నిబంధనలు లేవు.

English summary

PM Kisan: రైతులకు అలర్ట్.. వెంటనే ఆ పని పూర్తి చేయండి.. లేకుంటే డబ్బులు రావు.. | Farmers who want to get money through the Kisan Samman Nidhi Yojana scheme must undergo this e KYC

In 2019, the central government introduced the Kisan Samman Nidhi Yojana scheme to help farmers. As a part of this scheme, Rs. 6 thousand is given to the rice donors annually.
Story first published: Saturday, December 24, 2022, 13:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X