For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న వ్యాపారులకు ఫేస్‌బుక్ రూ.32 కోట్ల సాయం

|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ చిన్న వ్యాపారాల కోసం రూ.32 కోట్ల గ్రాంట్‌ను ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ నగరాల్లోని 3000కు పైగా చిన్న వ్యాపారాలకు 4.3 మిలియన్ డాలర్లు (రూ.32 కోట్లు) అందించనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కార్యకలాపాలు పెంచుకునేందుకు వీలుగా తోడ్పాటు అందించేందుకు గ్రాంట్ ప్రకటించినట్లు తెలిపింది.

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న వారికి తమవంతుగా అండగా ఉండేందుకు 30 దేశాల్లోని చిన్న వ్యాపారులు కోలుకునేందుకు 100 మిలియన్ డాలర్ల సాయాన్ని మార్చి నెలలో ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్‌కు రూ.32 కోట్ల గ్రాంట్‌ను తాజాగా ప్రకటించింది.

Facebook announces Rs 32 crore grants for SMBs in India

100 మిలియన్ డాలర్ల సాయంలో ఇది భాగమని ఫేస్‌బుక్ ఇండియా ఎండీ, వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్ తెలిపారు. ఈ సాయం నగదు, యాడ్ క్రెడిట్స్ రూపంలో ఇస్తామని వెల్లడించారు. ఇందులో నగదు మొత్తంలోనే ఎక్కువగా ఉందని చెప్పారు. అన్ని పరిశ్రమలు, విభాగాలకు చెందిన చిన్న వ్యాపారులకు ఈ సాయం అందిస్తామని తెలిపింది. ఆయా సంస్థలు తమకు నచ్చిన విధంగా సాయాన్ని వినియోగించుకోవచ్చునని వెల్లడించింది.

కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే ఆఫర్!కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే ఆఫర్!

English summary

చిన్న వ్యాపారులకు ఫేస్‌బుక్ రూ.32 కోట్ల సాయం | Facebook announces Rs 32 crore grants for SMBs in India

Facebook has announced a grant of ₹32 crores for more than 3,000 small businesses across Delhi, Gurgaon, Mumbai, Hyderabad, and Bangalore.+
Story first published: Wednesday, September 16, 2020, 14:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X