For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC పాలసీదారులకు శుభవార్త, ప్రీమియం గడువు నెల రోజులు పెంపు

|

కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నేపథ్యంలో జీవిత బీమా పాలసీదారులకు ప్రీమియం చెల్లింపు విషయంలో వెసులుబాటు ఇస్తూ బీమారంగ అభివృద్ధి నియంత్రణ సంస్థ (IRDAI) నిర్ణయం తీసుకుంది. పాలసీదారులకు పెద్ద ఊరట ఇచ్చింది. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో పునరుద్ధరణ (రెన్యువల్) కావాల్సిన జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపు గడువును మరో నెల రోజులు పొడిగించింది.

మూడు వారాల లాక్ డౌన్ నేపథ్యంలో పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో IRDAI ఈ నిర్ణయం తీసుకున్నది. పాలసీలో ప్రీమియం గడువు పొడిగింపు నిబంధన ఉన్నా లేకపోయినా ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఆరోగ్య, థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చెల్లింపు గడువుని IRDAI ఇప్పటికే నెల రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులకు కూడా వర్తిస్తుంది.

ట్రంప్ లాక్‌డౌన్‌కు ఎందుకు దూరం జరిగారు, రెండు కారణాలివే!ట్రంప్ లాక్‌డౌన్‌కు ఎందుకు దూరం జరిగారు, రెండు కారణాలివే!

Extra time for insurance policy renewal, premiums

మార్చి, ఏప్రిల్ నెలల్లో కట్టవలసిన రెన్యువల్ ప్రీమియంలకు సంబంధించి పాలసీదారులకు మరో 30 రోజుల వ్యవధి ఉంటుందని ఉంటుందని చెబుతూ అందరికీ సందేశాలు పంపించింది. మార్చి 25-ఏప్రిల్ 14 మధ్య కట్టాల్సిన మోటార్‌ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఏప్రిల్ 21వ తేదీలోగా చెల్లించవచ్చని ఇదివరకు వెసులుబాటు ఇచ్చింది.

English summary

LIC పాలసీదారులకు శుభవార్త, ప్రీమియం గడువు నెల రోజులు పెంపు | Extra time for insurance policy renewal, premiums

Considering the hardships people are facing amid coronavirus outbreak in the country, the IRDAI has announced a slew of measures for policyholders and insurance companies.
Story first published: Monday, April 6, 2020, 15:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X