ఈఎస్ఐ పథకంలో చేరిన 9.33 లక్షల మంది.. డేటా రిలీజ్
ఈఎస్ఐసీ సభ్యుల సంఖ్య పెరుగుతోంది. నవంబర్ నెలలో 9.33 లక్షల మంది సభ్యులు చేరారు. అంతకముందు నెలలో ఆ సంఖ్య 11.99 లక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటాను రిలీజ్ చేసింది. అదే జూన్ నెలలో ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 8.87 లక్షలు ఉండేది. మే నెలలో 4.89 లక్షలు కాగా.. ఏఫ్రిల్‌లో 2.63 ఉన్నది.
కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్‌తో ఈఎస్ఐ కొత్త సభ్యుల సంఖ్య తక్కువగానే నమోదవుతోంది. జూలై వరకు ఇలానే ఉండేది. 7.63 లక్షల నుంచి క్రమంగా పెరిగింది. ఆగస్ట్ వరకు 9.5 లక్షలకు చేరింది. సెప్టెంబర్‌లో 11.58 లక్షలకు వచ్చింది. కరోనా వైరస్ వల్ల మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

మార్చిలో 8.21 లక్షల కొత్త సభ్యులు చేరారు. ఫిబ్రవరిలో 11.83 లక్షలు ఉంది. 2019-20లో ఈఎస్ఐసీ సభ్యుల సంఖ్య 1.51 కోట్ల మంది ఉన్నారు. అంతకుముందు ఆ సంఖ్య 1.49 కోట్లు ఉంది. 2017 సెప్టెంబర్, మార్చి 2018 మధ్య 83.55 లక్షల కొత్త సభ్యులు చేరారు.