For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు SEBI హెచ్చరిక.. మీ మంచికోసమే అంటూ వార్నింగ్..!!

|

SEBI Warning: భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దేశంలోని ఇన్వెస్టర్లకు తాజాగా ఒక హెచ్చరికను జారీ చేసింది. ఈక్విటీ మార్కెట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రేడింగ్ చేయటానికి సంబంధించి సూచనను అందించింది.

సెబీ హెచ్చరిక..

సెబీ హెచ్చరిక..

సెక్యూరిటీస్ మార్కెట్‌లో నిరంతరం సాఫీగా లావాదేవీలు జరిపేందుకు ఇన్వెస్టర్లు తమ పాన్‌ను మార్చి 31లోగా ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ సూచించింది. సీబీడీటీ సర్క్యులర్‌కు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయని వారి ఖాతాలు KYC కానివిగా పరిగణించబడతాయి. దీనికి తోడు సెక్యూరిటీలు, ఇతర లావాదేవీలపై పరిమితులు ఉండవచ్చని సెబీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

టాక్స్ రూల్స్ ప్రకారం..

టాక్స్ రూల్స్ ప్రకారం..

ఆదాయపు పన్ను చట్టం-1961లోని నిబంధనల ప్రకారం PAN నంబరు కేటాయించబడిన ప్రతి వ్యక్తి తమ ఆధార్ నంబర్‌ను నిర్దేశిత అధికారికి తెలియజేయడం తప్పనిసరి. దీని ద్వారా పాన్, ఆధార్ లను అనుసంధానించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను నోటిఫై చేసిన తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే సీబీడీటీ 2022 మార్చిలో విడుదల చేసిన సర్క్యులర్ నెం-7 ప్రకారం మార్చి 31, 2023లోపు ఆధార్‌తో లింక్ చేయకపోతే ఒక వ్యక్తికి కేటాయించిన పాన్ పనిచేయదు.

PAN ఎందుకు కీలకం..

PAN ఎందుకు కీలకం..

సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీలు, మార్కెట్లో సెక్యూరిటీల అన్ని లావాదేవీలను నిర్వహించటానికి KYC పూర్తి చేయటం అత్యవసరం. అయితే దీనికి PAN కీలకమైన గుర్తింపు సంఖ్య. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCలు), ట్రస్టీ ఎంటిటీల కోసం ఫోరెన్సిక్ ఆడిటర్ల ఎంప్యానెల్‌మెంట్ కోసం దరఖాస్తుల సమర్పణ కోసం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ మార్చి చివరి వరకు గడువును పొడిగించింది.

English summary

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు SEBI హెచ్చరిక.. మీ మంచికోసమే అంటూ వార్నింగ్..!! | Equity Markets regulator warns investors to complete PAN, Aadhaar linking by march 31st 2023 for seamless trading

Equity Markets regulator warns investors to complete PAN, Aadhaar linking by march 31st 2023 for seamless trading
Story first published: Thursday, March 9, 2023, 9:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X