For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగాలు లేవు... రెండేళ్లుగా ఇదే పరిస్థితి: ఈ రంగాలు బెట్టర్

|

న్యూఢిల్లీ: అంతర్జాతీయవ్యాప్తంగా, దేశీయంగా ఆర్థికమాంద్యం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు తమ వర్క్ ఫోర్స్‌ను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌లోను ఉద్యోగ రేటు మందగించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో నియామకాలు చాలా నిరుత్సాహకరంగా ఉన్నాయని కేర్ రేటింగ్ స్టడీ చెబుతోంది. 2017-18లో 3.9% తగ్గిన ఉద్యోగ వృద్ధిరేటు 2018-19లో 2.8% ఉందని సర్వేలో తేలింది.

వచ్చే రెండేళ్లలో.. ఆ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు 'ఉఫ్'!వచ్చే రెండేళ్లలో.. ఆ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు 'ఉఫ్'!

తొలి పది రంగాల్లో 895 సంస్థలు.. 47 లక్షల ఉద్యోగులు

తొలి పది రంగాల్లో 895 సంస్థలు.. 47 లక్షల ఉద్యోగులు

2016-17 ఆర్థిక సంవత్సరంలో నియామకాలు జోరుగా సాగాయని కేర్ రేటింగ్ స్టడీ చెబుతోంది. అప్పుడు వృద్ధిరేటు 4.1% ఉందని పేర్కొంది. అంతకుముందు, 2015-16లో ఇది 2.5% ఉందని పేర్కొంది. దాదాపు అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకొని, మొత్తం 1,938 సంస్థల వివరాల ఆధారంగా నివేదికని సిద్ధం చేసింది. తొలి పది రంగాల్లో 895 సంస్థలుండగా, వీటిలో 47 లక్షల ఉద్యోగులు పని చేస్తున్నారు. మొత్తం సంస్థల్లోని ఉద్యోగుల్లో ఇది నాలుగింట మూడొంతులు.

ఈ రంగాలు నిస్తేజం

ఈ రంగాలు నిస్తేజం

కీలక రంగాలు ఢీలా పడుతున్నాయని కేర్ రేటింగ్ పేర్కొంది. జీడీపీలో మెజార్టీ వాటా కలిగిన పరిశ్రమలు నిస్తేజంగా ఉండి, నియామకాలు తగ్గించుకున్నట్లు తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో ప్రమాద ఘంటికలు ఉన్నాయని తెలిపింది. ఎన్పీఏలు కీలక రంగాలకు ఇబ్బందికరంగా మారినట్లు పేర్కొంది. మౌలిక రంగంలో వృద్ధి రేటు 0.4 శాతంగా మాత్రమే ఉంది. టెలికం, హాస్పిటాలిటీ, రియాల్టీ రంగాల్లోను వృద్ధి ప్రతికూలంగా ఉంది. టెలికం సంస్థలు అయితే నియామకాలకు దూరంగా ఉన్నాయి.

ఇవి బెట్టర్..

ఇవి బెట్టర్..

కేవలం హెల్త్ కేర్, ఆటోమొబైల్ రంగాల్లో మాత్రమే వృద్ధి రేటు ఆరోగ్యకరంగా ఉన్నట్లు కేర్ రేటింగ్ తెలిపింది. ఇక్కడ ఉద్యోగ రేటు 4.8 శాతంగా ఉంది. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ, బీమా రంగాలు ఆకర్షణీయ వృద్ధిని నమోదు చేశాయి. అయితే ఆటో అమ్మకాలు రికార్డ్ స్థాయిలో పతనమైన నేపథ్యంలో దాని అనుబంధ పరిశ్రమలు ఒత్తిడిలో ఉన్నాయని, ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు లేకుంటే ఎన్ని ఉద్యోగాలు పోతాయో చెప్పలేమంటున్నారు. 2015-19 జీడీపీ 7.5 శాతం ఉండగా, ఆ సమయంలోను కార్పోరేట్ జాబ్స్ మాత్రం కేవలం 3.3 శాతం మాత్రమే అని తెలిపింది.

English summary

ఉద్యోగాలు లేవు... రెండేళ్లుగా ఇదే పరిస్థితి: ఈ రంగాలు బెట్టర్ | Employment growth in India slowed in last two years

The pace of employment growth in India slowed in the last two years with job creation growing 3.9% in 2017-18 and 2.8% in 2018-19, a study done by ratings agency CARE Ratings showed.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X