For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Employees Protests: జీతాలు పెంచాలని ఆందోళనకు దిగుతున్న ఉద్యోగులు.. పెరుగుతున్న ఖర్చులను మోయలేక..

|

Employees Protests: ప్రపంచ వ్యాప్తంగా ఒకపక్క ఆహార ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంధన బిల్లులు, ఇతర ఖర్చులను అనుకూలంగా ఉద్యోగులకు వేతనాలు మాత్రం అందడం లేదు. ద్రవ్యోల్బణం ప్రజల పర్సులను కొల్లగొడుతోంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, కార్మికుల సమ్మెలను రేకెత్తిస్తున్నాయి.

ఏఏ దేశాల్లో ఎలా జరుగుతున్నాయంటే..

ఏఏ దేశాల్లో ఎలా జరుగుతున్నాయంటే..

ఈ వారంలోనే పాకిస్తాన్‌లో రాజకీయ ప్రతిపక్షాలు, జింబాబ్వేలో నర్సులు, బెల్జియంలో యూనియన్ కార్మికులు, బ్రిటన్‌లోని రైల్వే కార్మికులు, ఈక్వెడార్‌లోని స్వదేశీ ప్రజలు, వందలాది యూఎస్ పైలట్లు, యూరోపియన్ ఎయిర్‌లైన్ కార్మికులు నిరసనలు చేయటం దీని ప్రభావాన్ని తెలియజేస్తోంది. అనేక వారాల రాజకీయ గందరగోళం తరువాత శ్రీలంక ప్రధాన మంత్రి బుధవారం ఆర్థిక పతనాన్ని ప్రకటించారు.

ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, ఎరువుల ధరలు వారిని మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ ప్రభావం ఉత్పత్తుల ధరలపై పడట వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

జీతాలు పెంచాలని చర్చలు..

జీతాలు పెంచాలని చర్చలు..

ఈ ప్రదర్శనలు ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాలా దేశాలు ప్రజలపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో సబ్సిడీలు, ఇంధన పన్నులపై కోతలు వంటివి అందిస్తున్నాయి. మరో పక్క వడ్డీరేట్లను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సెంట్రల్ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాల పెంపుపై చర్చలు జరపాలని సమ్మెలో ఉన్న అనేక దేశాల కార్మికులు తమ యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారు.

ఈ క్రమంలోనే యూకేలో రైల్వే ఉద్యోగులు సమ్మేకు దిగటంతో సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయని బ్రిటన్ రైల్, మారిటైమ్ మరియు ట్రాన్స్‌పోర్ట్ యూనియన్‌లోని సీనియర్ అధికారి ఎడ్డీ డెంప్సే తెలిపారు. 30 ఏళ్లుగా జీతాలు పడిపోతున్నాయని పెంచాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

కెన్యాలో కిడ్నీలు అమ్మేందుకు సిద్ధం..

కెన్యాలో కిడ్నీలు అమ్మేందుకు సిద్ధం..

గత వారం దక్షిణ కొరియాలో వేలాది ట్రక్కర్లు ఎనిమిది రోజుల సమ్మెను ముగించారు. ఇది ఇంధన ధరల పెరుగుదల మధ్య కనీస వేతన హామీల కోసం వారు పిలుపునిచ్చినందున రవాణా ఆలస్యానికి కారణమైంది. స్పెయిన్‌లో ట్రక్కర్లు ఇంధన ధరలకు నిరసనగా సమ్మె చేశారు. పెరూలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంకలో పెట్రోల్ ధరలు తాజాగా లీటరుకు రూ.60 పెరగటంతో అక్కడ టోకెన్ విధానాన్ని అక్కడి ప్రభుత్వం ప్రాంభించింది.

అఫ్ఘనిస్తాన్, యెమెన్, మయన్మార్, హైతీ వంటి సంఘర్షణ ప్రాంతాలలో శరణార్థులు, పేదల పరిస్థితి ముఖ్యంగా భయంకరంగా ఉంది. కెన్యాలో ప్రజలు తమ అవయవాలు అమ్ముకునేందుకునేందుకు సిద్ధమౌతున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు చాలా ఆందోళనకర స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వాలు ఆహార భద్రతను కల్పించాలని అనేక మంది కోరుతున్నారు.

English summary

employees around the world protesting amid high inflation to increase their pay to meet rising expenses

Economists say Russia's war in Ukraine amplified inflation by further pushing up the cost of energy, grains, cooking oils
Story first published: Monday, June 27, 2022, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X