For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'టెస్లా' ఎలాన్ మస్క్ ఒక్క ట్వీట్, రూ.1 లక్ష కోట్ల సంపద ఆవిరి: అసలు ఏం చెప్పాడు?

|

ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ ఆ సంస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాన్ చేసిన శుక్రవారం చేసిన ఓ ట్వీట్ కారణంగా ఆ కంపెనీ షేర్ వ్యాల్యూ 80.56 డాలర్లు తగ్గి 701.32 డాలర్లకు పడిపోయింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే బిలియన్ల డాలర్లు నష్టపోవాల్సి వచ్చింది.

COVID 19: డబ్బును ముద్రిస్తే ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కుతామా? ఇతర దేశాలు చేశాయా?COVID 19: డబ్బును ముద్రిస్తే ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కుతామా? ఇతర దేశాలు చేశాయా?

మస్క్ షేర్లు 3 బిలియన్ డాలర్లు హుష్ కాకి

మస్క్ షేర్లు 3 బిలియన్ డాలర్లు హుష్ కాకి

ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్ కారణంగా కంపెనీ మార్కెట్ వ్యాల్యూ కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా 15 బిలియన్ డాలర్ల మేరకు క్షీణించింది. ఎలాన్ మస్క్ సొంత వాటాలో దాదాపు 3 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. అంటే మన కరెన్సీలో టెస్లా ఆస్తులు దాదాపు రూ.లక్ష కోట్లు హరించుకుపోయాయి. ఆయన చేసిన ట్వీట్ కారణంగా టెస్లా షేర్లు ఏకంగా 10 శాతం పడిపోయాయి.

అసలు ఏమని ట్వీట్ చేశారు?

అసలు ఏమని ట్వీట్ చేశారు?

ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ కూడా చాలా ఆశ్చర్యకరమైనదిగా చెప్పవచ్చు. ప్రస్తుతం టెస్లా షేర్ వ్యాల్యూ చాలా అధికంగా ఉందని అభిప్రాయపడుతున్నట్లు ఆ ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుండి టెస్లా షేర్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ ట్వీట్‌తో మస్క్‌ సీఈవో పదవికి ముప్పు ఏర్పడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. గతంలో కూడా ఓ ట్వీట్‌పై వివాదం చెలరేగింది. దీంతో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ 40 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించింది. ఈ జరిమానాను మస్క్, టెస్లా సగం సగం చెల్లించారు. టెస్లా డైరెక్టర్ల బోర్డులో ఎలాన్ మస్క్ చైర్మన్ పదవికి ఎసరు పడింది.

షేర్ల వ్యాల్యూ ఎందుకు పెరుగుతోంది?

షేర్ల వ్యాల్యూ ఎందుకు పెరుగుతోంది?

విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్ నుంచి టెస్లా కంపెనీ లాభపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే టెస్లా షేర్ ధరలు ఈ ఏడాది పెరుగుతున్నాయి. మస్క్ మాత్రం అనూహ్యంగా టెస్లా షేర్లు ఎక్కువే ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొనడం గమనార్హం.

English summary

'టెస్లా' ఎలాన్ మస్క్ ఒక్క ట్వీట్, రూ.1 లక్ష కోట్ల సంపద ఆవిరి: అసలు ఏం చెప్పాడు? | Elon Musk tweet wipes $14bn off Tesla's value: Was twitter meltdown illegal?

Tesla boss Elon Musk wiped $14bn (£11bn) off the carmaker's value after tweeting its share price was too high.
Story first published: Sunday, May 3, 2020, 13:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X