For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింతగా ఉంది: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆశ్చర్యం! నెటిజన్ల చురకలు ఇలా..

|

వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను దాటి, ప్రపంచ కుబేరుడిగా నిలిచిన టెస్లా ఇంక్ సీఈవో ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా నిలవడంపై స్వయంగా ఆయనే ఆశ్చర్యపోయారు. ఈ ఘనత సాధించడం వింతగా ఉందని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. దీనిపై టెస్లా ఓనర్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ ఓ పోస్ట్ చేసింది.

జెఫ్ బెజోస్‌ను దాటేశాడు.. చరిత్రలో అత్యంత వేగంగా సంపద సృష్టించిన ఎలాన్ మస్క్జెఫ్ బెజోస్‌ను దాటేశాడు.. చరిత్రలో అత్యంత వేగంగా సంపద సృష్టించిన ఎలాన్ మస్క్

వెల్.. బ్యాక్ టు వర్క్

వెల్.. బ్యాక్ టు వర్క్

ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు అని టెస్లా ఓనర్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను మస్క్‌కు ట్యాగ్ చేసింది. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. వింతగా ఉంది అని ఒక్క మాటలో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో ట్వీట్‌లో వెల్.. బ్యాక్ టు వర్క్ అని పేర్కొన్నారు.

నెటిజన్ల చురకలు

నెటిజన్ల చురకలు

ఎలాన్ మస్క్ స్పందనతో నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. చాలా చమత్కారమైన వ్యక్తి అని, నిజమైన లెజెండ్ అంట ఈయనే అని పలువురు పేర్కొన్నారు. మరికొందరు ఆయనకు చురకలు అంటించారు. ఇంత డబ్బు ఉంది కానీ ఒక్క శాతమైన దానం చేశాడా అని ప్రశ్నించారు. అవసరమైన వారికి సాయం చేయవచ్చు కదా అని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు. ప్రపంచంలో 7.8 బిలియన్ల మంది ఉన్నారని, ఒక్కొక్కరికి బిలియన్ ఇచ్చినా ఇంకా చాలా మిగిలి ఉంటుందని మరొకరు లెక్కలు వేశారు.

సంపద జంప్

సంపద జంప్

అమెరికా సమయం ప్రకారం గురువారం ఉదయం పది గంటలకు ఎలాన్ మస్క్ నికర సంపద 188.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారత కరెన్సీలో ఇది రూ.14 లక్షల కోట్లకు పైగా. దీంతో 2017 నుండి అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ రెండో స్థానంలోకి వెళ్లారు. బెజోస్ సంపద కంటే మస్క్ ఆస్తి 1.5 బిలియన్ డాలర్లు ఎక్కువ. టెస్లా షేర్లు ఓ సమయంలో 7.4 శాతం కూడా ఎగిశాయి. ఆల్ టైమ్ గరిష్టం 811.61 డాలర్లను తాకింది.

English summary

వింతగా ఉంది: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆశ్చర్యం! నెటిజన్ల చురకలు ఇలా.. | Elon Musk's Strange Reaction To Becoming World's Richest Person

Elon Musk, the outspoken entrepreneur behind Tesla Inc. and SpaceX, is now the richest person in the world - a feat he himself finds "strange".
Story first published: Friday, January 8, 2021, 13:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X