For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 గంటల్లో రూ.1.1 లక్షల కోట్లు.. జుకర్‌బర్గ్‌ను వెనక్క నెట్టిన ఎలాన్ మస్క్

|

టెస్లా, స్పెసెక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్.. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ మూడో ధనవంతుడిగా ఎదిగారు. ఇది కేవలం 2 గంటల్లోనే జరిగింది. 120 నిమిషాల్లోనే అతని సంపాదన 15 బిలియన్ డాలర్లు లేదా 1.1 లక్షల కోట్లు సంపాదించారు. దీంతో అతను ప్రపంచ మూడో కుబేరుడిగా నిలిచారు. అమెరికా సూచీ ఎస్ అండ్ పీ 500లో టెస్లా చోటు దక్కించుకోవడంతో ఈ ఘనత దక్కింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 180 బిలియన్ డాలర్లకు పైగా సంపాదనతో ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు. టాప్ 20లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు.

44,000 మార్క్ దాటిన సెన్సెక్స్, అంతలోనే కిందకు.. ఐటీ స్టాక్స్ దెబ్బ: కారణాలివే..44,000 మార్క్ దాటిన సెన్సెక్స్, అంతలోనే కిందకు.. ఐటీ స్టాక్స్ దెబ్బ: కారణాలివే..

2 గంటల్లోనే...

2 గంటల్లోనే...

ప్రతిష్టాత్మక ఎస్ అండ్ పీలో టెస్లా కంపెనీ చోటు దక్కించుకుంది. డిసెంబర్ 21వ తేదీ నుండి ఈ షేరుకు చోటు కల్పిస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఎస్ అండ్ పీ డౌజోన్స్ ఇండెక్స్ పేర్కొంది. మార్కెట్లు ముగిసిన తర్వాత ఈ వార్త వచ్చింది. దీంతో టెస్లా షేర్ ఫ్యూచర్‌లో ఏకంగా 14 శాతం ఎగిసింది. సోమవారం టెస్లా స్టాక్స్ 408.09 డాలర్ల వద్ద ముగిసింది. టెస్లా షేర్ ఎగిసిపడటంతో కేవలం రెండు గంటల్లోనే మార్క్ జుకర్‌బర్గ్‌ను దాటేశారు ఎలాన్ మస్క్.

ఎలాన్ మస్క్ సంపద ఎంతంటే

ఎలాన్ మస్క్ సంపద ఎంతంటే

టెస్లా షేర్లు జంప్ చేయడంతో ఎలాన్ మస్క్ సంపద 117.9 బిలియన్ డాలర్లకు పెరిగి, ప్రపంచ మూడో సంపన్నుడిగా నిలిచారు. గత 12 నెలల కాలంలో ఎలాన్ మస్క్ సంపద 90 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచంలోనే మరే ఇతర కుబేరుడి సంపద ఈ కాలంలో ఇంత పెద్ద మొత్తంలో పెరగలేదు. జెఫ్ బెజోస్ సంపద కూడా భారీగానే పెరిగినప్పటికీ, మస్క్ సంపద అంతకంటే ఎక్కువ ఎగిసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పెసెక్స్ ఇటీవల నాసా సహకారంతో 4గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది.

ఎస్ అండ్ పీలో చేరితే..

ఎస్ అండ్ పీలో చేరితే..

ఈ ఏడాది టెస్లా షేర్లు 450 శాతం ర్యాలీ చేశాయి. దీంతో మస్క్ సంపద ఏడాదిలో 90 బిలియన్ డాలర్లు పెరిగింది. టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 387 బిలియన్ డాలర్లను తాకింది. ఎస్ అండ్ పీ లేదా స్టాండర్డ్ అండ్ పూర్ 500 సూచీ అత్యంత ప్రతిష్టాత్మక మార్కెట్ క్యాపిటలైజేషన్ సూచీ.

ఇందులో చేరడం వల్ల యూఎస్ ఇండెక్స్ ఫండ్స్ పెట్టుబడి ప్రణాళికల్లో సవరణలు చోటు చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కంపెనీకి ఉన్న వెయిటేజీ పరంగా 51 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇతర కౌంటర్ల నుండి టెస్లాకు మళ్లవచ్చు. ఎస్ అండ్ పీలో చేరడం ద్వారా అధికారికంగా బ్లూచిప్‌గా టెస్లా మారనుంది. ఏదైనా ప్రామాణిక ఇండెక్స్‌లో చోటు దక్కాలంటే 8.2 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉండాలి. అధిక లిక్విడిటీతో ప్రజల వద్ద 50 శాతం వాటా ఉండాలి. నాలుగు క్వార్టర్‌లు లాభాలు ఆర్జించాలి.

English summary

2 గంటల్లో రూ.1.1 లక్షల కోట్లు.. జుకర్‌బర్గ్‌ను వెనక్క నెట్టిన ఎలాన్ మస్క్ | Elon Musk Makes 15 Billion dollars In 2 Hours, Beats Zuckerberg

Tesla and SpaceX founder Elon Musk has just become World’s 3rd richest person, by beating Facebook founder Mark Zuckerberg.
Story first published: Tuesday, November 17, 2020, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X