For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Byju's Layoff: 2,500 మందిని తొలగిస్తున్న బైజూస్ స్టార్టప్.. కానీ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది..

|

Byjus News: కరోనా తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకోవటంతో ఎడ్ టెక్ కంపెనీలు, స్టార్టప్ లకు కష్టాలు మెుదలయ్యాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇదే సమయంలో బైజూ సరికొత్త ప్లాన్ తో ముందుకు సాగాలని రూట్ మ్యాప్ వేసుకుని ముందుకు సాగుతోంది.

లాభాల్లోకి వెళ్లేందుకు..

లాభాల్లోకి వెళ్లేందుకు..

ప్రఖ్యాత ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ టైగర్ గ్లోబల్ సపోర్ట్ తో ముందుకెళుతున్న బైజూ 2021 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.4,588 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే కంపెనీ పెరుగుతున్న ప్రమోషన్, సేల్స్, లేబర్ ఖర్చులను తగ్గించుకుని 2023 నాటికి లాభాల్లోకి రావాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా కంపెనీ తాజాగా 2,500 మందిని రానున్న ఆరు నెలల్లో తొలగించాలని నిర్ణయించుకుంది.

టీచర్ల రిక్రూట్ మెంట్..

టీచర్ల రిక్రూట్ మెంట్..

కంపెనీ కొత్త సహకారాల ద్వారా విదేశాల్లో బ్రాండ్ అవగాహనను ఏర్పరచుకోవడంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తుంది. అలా అంతర్జాతీయ కార్యకలాపాల కోసం 10,000 మంది ఉపాధ్యాయులను కొత్తగా నియమించుకోవాలని నిర్ణయించినట్లు బైజూ సహ-వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్ తెలిపారు. ఇందులో భాగంగా కంపెనీ తన వ్యాపార యూనిట్లను ఏకీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది.

కంపెనీ లాభనష్టాలు..?

కంపెనీ లాభనష్టాలు..?

కంపెనీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,511 కోట్లను ఆర్జించినప్పటికీ.. ర.231.69 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అదే 2020-21 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే రూ.2,428 కోట్ల ఆదాయానికి గాను కంపెనీ రూ.4,588 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంటే ఈ కాలంలో నష్టాలు దాదాపు 19 రెట్లు పెరిగాయి. గతంలో కంపెనీ బ్లాక్ రాక్ కంపెనీకి చెల్లించాల్సిన రూ.1,500 కోట్లను సమయానికి చెల్లించలేక పోయిన సంగతి తెలిసిందే.

నాలుగు రెట్లు అధికంగా..

నాలుగు రెట్లు అధికంగా..

మార్చి 31, 2022న ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగి ఏకంగా రూ.10,000 కోట్లకు చేరుకుందని కంపెనీ నివేదించింది. కంపెనీ తన ప్రయాణంలో భాగంగా వైట్‌హాట్ జూనియర్, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ కంపెనీలను సొంతం చేసుకుంది. అయితే

Read more about: byjus startup business news jobs
English summary

Byju's Layoff: 2,500 మందిని తొలగిస్తున్న బైజూస్ స్టార్టప్.. కానీ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది.. | edtech startup Byju's firing 2500 employees to cut costs descided to recruit teachers

edtech startup Byju's firing 2500 employees to cut costs descided to recruit teachers
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X