ఎడిబుల్ ఆయిల్స్/వంట నూనె ధరలు పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. వేరుశనగ (గ్రౌండ్‌నట్), ఆవాలు(మస్టర్డ్), వనస్పతి, సోయాబీన్, పొద్దు తిరుగుడు (సన్‌ఫ్లవర్) నూనెలు గత ఏడాదితో పోలిస్తే 25 శాతం నుండి 30 శాతం వరకు పెరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని కేబినెట్ గ్రూప్‌లో గతవారం ఈ అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఆలు ధరలు కూడా ఎగిశాయి. అయితే కేంద్రం ఎగుమతులపై ఆంక్షలు, పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం, నిల్వలను మార్కెట్లకు తరలించడం వంటి వివిధ చర్యలు చేపట్టడంతో ఉల్లి ధరల పెరుగుదల నిలిచిపోయింది. ఆలు ధరలు కూడా దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఏడాదిలో 30 శాతం వరకు పెరిగిన నూనె ధరలు ఆందోళనను కలిగిస్తున్నాయి.

గత ఏడాది నుండి ధరల పెరుగుదల ఇలా
కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రైస్ మానిటరింగ్ సెల్ డేటా ప్రకారం మస్టర్డ్ ఆయిల్ లీటర్ ధర గత ఏడాది ఇదే సమయంలో రూ.100 ఉండగా, ఇప్పుడు రూ.120కి పెరిగింది. వనస్పత నూనె ఏడాది క్రితం రూ.75.25 ఉండగా, ఇప్పుడు రూ.102కు పెరిగింది. సోయాబీన్ నూనె 2018 అక్టోబర్ 18వ తేదీన 90 ఉండగా, ఇప్పుడు రూ.110కి చేరుకుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ ధరల్లోను దాదాపు 25 శాతం నుండి 30 శాతం పెరుగుదల కనిపించింది.

ధరలు పెరగడానికి కారణం...
గత ఆరు నెలలుగా మలేషియాలో పామాయిల్ ఉత్పత్తి పడిపోవడం ఈ ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. మన దేశంలో ప్రాసెస్ చేసిన దాదాపు 70 శాతం పామాయిల్‌ను ఆహార పరిశ్రమ ఉపయోగిస్తోంది. ఇది అతిపెద్ద వినియోగదారు. మన దేశంలో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో పామాయిల్ పైన దిగుమతి సుంకాన్ని తగ్గించడం ప్రభుత్వం చేతిలో ఉందని ఈ పరిశ్రమ కోరుతోంది. పామాయిల్ ధరల పెరుగుదల మొత్తం ఎడిబుల్ ఆయిల్స్ పైన పడ్డాయని చెబుతున్నారు.

దిగుమతి సుంకం తగ్గిస్తే..
కొద్ది నెలల క్రితం కిలో రూ.20 అంతకంటే తక్కువగా ఉన్న ఉల్లి ధరలు భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.100కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం పలు చర్యలు చేపట్టింది. దీంతో ధరలు కాస్త దిగి వచ్చాయి. ఇప్పుడు వంట నూనె ధరలు కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం పామాయిల్ ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దిగుమతి సుంకాన్ని యోచన చేస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications