For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజయ్ మాల్యాకు మరో షాక్ ఇచ్చిన ఈడీ.. ఫ్రాన్స్ లో 1.6 కోట్ల యూరోల విలువైన ఆస్తుల అటాచ్

|

భారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు కింగ్‌ఫిషర్‌ మాజీ యజమాని విజయ్‌ మాల్యాకు ఈడీ మరో షాక్ ఇచ్చింది . ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు టోపీ పెట్టిన ఎగవేత దారుడు, వైట్ కాలర్ నేరస్తుడు, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ మాల్యాను తిరిగి స్వదేశానికి తీసుకురావడం కోసం కేంద్రం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.

దేశీయ ఈ కామర్స్ సంస్థల ఏర్పాటుకు కేంద్రం అడుగులు.. రూల్స్ ఫ్రేమ్ చేసేందుకు నిపుణుల కమిటీదేశీయ ఈ కామర్స్ సంస్థల ఏర్పాటుకు కేంద్రం అడుగులు.. రూల్స్ ఫ్రేమ్ చేసేందుకు నిపుణుల కమిటీ

ఫ్రాన్స్‌లోని 32 అవెన్యూ ఫోచ్‌లో ఉన్న విజయ్ మాల్యా ఆస్తిని అటాచ్ చేసిన ఈడీ

ఫ్రాన్స్‌లోని 32 అవెన్యూ ఫోచ్‌లో ఉన్న విజయ్ మాల్యా ఆస్తిని అటాచ్ చేసిన ఈడీ

భారతదేశ ఆర్ధిక నేరగాడు, ఇండియాలో 9 వేల కోట్ల విలువైన రుణాలను బ్యాంకులకు ఎగవేసి లండన్ కు

పారిపోయిన విజయ్ మాల్యాకు చెందిన ఫ్రాన్స్ లో 1.6 కోట్ల యూరోల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫ్రాన్స్‌లోని 32 అవెన్యూ ఫోచ్‌లో ఉన్న విజయ్ మాల్యా ఆస్తిని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఇడి) అభ్యర్థన మేరకు ఫ్రెంచ్ అథారిటీ స్వాధీనం చేసుకుంది. ఫ్రాన్స్‌లో స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ 1.6 మిలియన్ యూరోలు (రూ .14 కోట్లు).

 కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంక్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు నగదు బదిలీ అయ్యిందన్న ఈడీ

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంక్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు నగదు బదిలీ అయ్యిందన్న ఈడీ

ఇక దీనిపై ప్రకటన విడుదల చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు నగదు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలిందన్నారు . ఇప్పటివరకు, 11,231 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.

విజయ్ మాల్యా యొక్క ఆస్తులను తాజాగా స్వాధీనం చేసుకోవడంతో, అతన్ని యూ కె నుండి రప్పించడానికి భారతదేశం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని అర్ధం అవుతుంది.

విజయ్ మాల్యాను రప్పించే యత్నం చేస్తున్న ఇండియా ప్రభుత్వం

విజయ్ మాల్యాను రప్పించే యత్నం చేస్తున్న ఇండియా ప్రభుత్వం

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు, అయిన విజయమాల్య 9,000 కోట్ల విలువైన రుణాలను ఎగవేసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఆర్ధిక నేరగాడు.ఆయన 2016 మార్చి నుండి యుకెలో నివసిస్తున్నాడు . అప్పటినుండి ఆయనను భారతదేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం పోరాడుతోంది. 64 ఏళ్ల విజయ మాల్యాను అప్పగించాలని మే నెలలో బ్రిటిష్ కోర్టు ఆదేశించింది, కాని దేశంలో ప్రారంభించిన రహస్య చట్టపరమైన వ్యవహారం వల్ల ఆలస్యం అయిందని ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది .

 విజయ్ మాల్యా ను ఇండియాకు తీసుకొస్తే మోడీకి అదో పెద్ద విజయం .. ఎందుకంటె

విజయ్ మాల్యా ను ఇండియాకు తీసుకొస్తే మోడీకి అదో పెద్ద విజయం .. ఎందుకంటె

భారతదేశంలో పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా పేరుపొందిన మాల్యా - రహస్య చట్టపరమైన విషయం పరిష్కారం అయ్యేవరకు రప్పించలేమని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది.

ప్రాసిక్యూషన్ నుండి తప్పించుకోవడానికి ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం నుండి పారిపోయిన అనేక మంది ఆర్థిక నేరగాళ్ల విషయంలో న్యాయం చేయమని, రాజకీయ ప్రత్యర్థుల ఒత్తిడిని ఎదుర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజయ్ మాల్యా ని తిరిగి భారతదేశానికి తీసుకురాగలిగితే అది పెద్ద విజయమే అవుతుంది. ఇక విజయ్ మాల్యా బాటలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలలో తలదాచుకుంటున్న నీరవ్ మోడీ తదితర రుణ ఎగవేత దారులను కూడా తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది.

English summary

విజయ్ మాల్యాకు మరో షాక్ ఇచ్చిన ఈడీ.. ఫ్రాన్స్ లో 1.6 కోట్ల యూరోల విలువైన ఆస్తుల అటాచ్ | ED seized Vijay Mallya's assets worth 1.6 crore euros in France

Fugitive billionaire Vijay Mallya's assets in France worth 1.6 million euros have been seized by the Enforcement Directorate, the probe agency said in a statement ."On the request of Directorate of Enforcement (ED), a property of Vijay Mallya located at 32 Avenue FOCH, France has been seized by the French Authority. The value of the seized asset in France is 1.6 million euros (Rs 14 crore). Investigations revealed that a large amount was remitted abroad from the bank account of Kingfisher Airlines Ltd," the ED said in a statement
Story first published: Saturday, December 5, 2020, 18:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X