For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ED Raids On VIVO: ఫోన్ల దిగ్గజం వివోపై ఈడీ దాడులు.. పన్ను ఎగవేతపై దర్యాప్తు.. 44 చోట్ల సెర్చ్..

|

ED Raids On VIVO: వరుసగా చైనా కంపెనీలు మనీలాండరింగ్ కేసుల్లో చిక్కుకుంటున్నాయి. గతంలో మెుబైల్ దిగ్గజం షియోమీ తర్వాత.. ఇప్పుడు వివో సంస్థకు చెందిన స్థావరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వ ఏజెన్సీ ED విచారణ జరుపుతోంది.

అనేక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు..

అనేక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు..

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 44 చోట్ల వివో, దాని అనుబంధ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. గతంలో మొబైల్ కంపెనీ షియోమీకి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రాయల్టీ, పన్ను ఎగవేత పేరుతో డబ్బును దేశం నుంచి పంపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చైనా కంపెనీలపై ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి వీవో కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ తో పాటు కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఫుల్ గా సంపాదిస్తూ టాక్స్ చెల్లించకుండా..

ఫుల్ గా సంపాదిస్తూ టాక్స్ చెల్లించకుండా..

దేశ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. వీటిలో Xiaomi, Oppo, Vivo వంటి చైనాకు చెందిన బ్రాండ్స్ ఉన్నాయి. దేశంలో ఈ కంపెనీలు రెండు చేతులా సంపాదిస్తున్నా ఒక్క పైసా కూడా పన్ను చెల్లించడం లేదు. ఈ కంపెనీల మోసాన్ని బట్టబయలు చేసేందుకు ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ ప్రోబ్ ప్రారంభించింది. చాలా ఏజెన్సీలు దీనిపై విచారణ జరుపుతున్నాయి. ఈ కంపెనీలు రెగ్యులేటరీ ఫైలింగ్‌లు, ఇతర రిపోర్టింగ్‌లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు వారి వ్యవహారశైలిపైనా ప్రభుత్వ ఏజెన్సీలు ఆరా తీస్తున్నారు.

ఆరోపణ ఏమిటంటే..

ఆరోపణ ఏమిటంటే..

చైనా కంపెనీలు తమ ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టాయని, పన్ను ఎగవేత కోసం లాభాలను నివేదించలేదని ఆరోపణలు వచ్చాయి. భారతీయ మార్కెట్లో దేశీయ పరిశ్రమను నాశనం చేయడానికి తమ పలుకుబడిని ఉపయోగించాయని ఆరోపించారు. దీనితో పాటు ఈ కంపెనీలు ఉత్పత్తుల పంపిణీలో పారదర్శకంగా లేవని కూడా ఆరోపించాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌తో చేసిన ఫైలింగ్‌లలో చైనా కంపెనీలు నష్టాలను చూపించాయి. ఈ సమయంలో అవి విపరీతమైన అమ్మకాలను కలిగి ఉండటంతో పాటు.. అత్యధిక ఫోన్‌లను విక్రయించే కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి.

English summary

ED Raids On VIVO: ఫోన్ల దిగ్గజం వివోపై ఈడీ దాడులు.. పన్ను ఎగవేతపై దర్యాప్తు.. 44 చోట్ల సెర్చ్.. | Ed Conducts Raids at 44 locations belong to chinese smart phone company vivo across india at a time in money laundering allegations

Ed Conducts Raids Against Vivo, Related Companies In Money Laundering Probe
Story first published: Tuesday, July 5, 2022, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X