For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగాలు పెరుగుతున్నా ఆర్థిక వ్యవస్థ కోలుకోదు.. ఎందుకంటే! కీలకమైన ఆ జాబ్స్ ఆందోళనకరంగా..

|

ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఊహించని విధంగా పడింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టవచ్చునని, ప్రజల ప్రాణాలు మాత్రం తిరిగి నిలబెట్టలేమనే ఉద్దేశ్యంతో... కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో మన ఆర్థిక వ్యవస్థపై కూడా భారీగానే ప్రభావం పడింది. ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని, అయితే పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని ఎక్కువమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు.

గుడ్‌న్యూస్, అమెరికాలో పెరుగుతున్న ఉద్యోగాలు: ఏ సిటీలో ఎంత నిరుద్యోగ శాతం?గుడ్‌న్యూస్, అమెరికాలో పెరుగుతున్న ఉద్యోగాలు: ఏ సిటీలో ఎంత నిరుద్యోగ శాతం?

ఉద్యోగాలు పెరుగుతున్నాయి.. కానీ

ఉద్యోగాలు పెరుగుతున్నాయి.. కానీ

దేశంలో జాబ్ మార్కెట్ క్రమంగా పుంజుకున్నది. కరోనా, లాక్ డౌన్ కారణంగా భారీగా పెరిగిన నిరుద్యోగం ఆ తర్వాత జూలై నాటికి కోలుకుంది. దాదాపు ప్రీ-లాక్ డౌన్ సమయానికి చేరుకుంది. అయితే పునరుద్ధరించబడిన జాబ్ మార్కెట్ ఎక్కువగా తక్కువ వేతనం ఉన్న అనధికారిక రంగానికి చెందినవి. మెరుగైన వేతనాలు ఉన్న ఉద్యోగాల విషయానికి వస్తే పరిస్థితి మరింతగా దిగజారుతున్నట్లుగా కనిపిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

హైశాలరీ ఉద్యోగాలు కొరత

హైశాలరీ ఉద్యోగాలు కొరత

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎంప్లాయిమెంట్ (CMIE) డేటా ప్రకారం ఏప్రిల్ 2020లో 12.5 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. మే నెలలో ఇది 100.3 మిలియన్లకు చేరుకొని స్వల్పంగా కోలుకుంది. జూన్‌లో 29.9 మిలియన్లకు తగ్గింది. జూలైలో మరింత ఎక్కువగా కోలుకుంది. ఉద్యోగాలు లేని వారి సంఖ్య 11 మిలియన్లకు చేరుకుంది. గత మూడు నెలల్లో ఉద్యోగాల పునరుద్ధరణ వేగంగా జరిగింది. అయితే ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగాల పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నందున ఇది వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణకు సంకేతంగా చెప్పలేమని అంటున్నారు. ఈ ఉద్యోగాల్లో పెరుగుదల కూడా కనిపించడం లేదని చెబుతున్నారు.

ఆందోళన కలిగించే అంశం..

ఆందోళన కలిగించే అంశం..

భారత జాబ్ రివైవల్ ఆందోళన కలిగించేదిగా ఉందని CMIE ఎండీ, సీఈవో మహేష్ వ్యాస్ ఇటీవల ఓ ఆర్టికల్‌లో పేర్కొన్నారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన శాలరీ జాబ్స్ ఇంకా కోలుకోలేదని, అసంఘటిత ఉద్యోగాలతో సమానంగా కోలుకోలేదని పేర్కొన్నారు. లాక్ డౌన్ తర్వాత వేతన ఉద్యోగుల పరిస్థితి దిగజారిందని, ఏప్రిల్ నెలలో 17.7 మిలియన్‌లకు పైగా వేతన ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారని, జూలైలో ఈ సంఖ్య 19 మిలియన్లకు పెరిగిందన్నారు.

శాలరైడ్ ఉద్యోగాలు అంత సులభంగా పోవని, అదే సమయంలో కోలుకోవడం కూడా అంతే కష్టమని అభిప్రాయపడ్డారు. బెట్టర్ పేయింగ్ జాబ్స్ కొరత పెరుగుతోందన్నారు. అందుకే ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునే అవకాశం కనిపించడం లేదని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

English summary

ఉద్యోగాలు పెరుగుతున్నా ఆర్థిక వ్యవస్థ కోలుకోదు.. ఎందుకంటే! కీలకమైన ఆ జాబ్స్ ఆందోళనకరంగా.. | Economy unlikely to recover soon despite growing employment

India’s employment numbers are almost back at par with pre-lockdown levels after a sharp recovery in jobs since April. But most of the employment that has been restored is from the low-paying informal sector. As far as the better-paying jobs are concerned, the situation seems to be worsening.
Story first published: Tuesday, August 11, 2020, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X