For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనావైరస్ దెబ్బ: డొనాల్డ్ ట్రంప్

|

చైనాలోని వూహాన్ నుండి వచ్చిన కరోనా వైరస్ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని, తమ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశముందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే దీనిని సవాల్‌గా తీసుకొని, సంక్షోభాన్ని దాటుతామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో చైనా-అమెరికా మధ్య ప్రయాణాలను తాము కట్టడి చేశామని, ఇది ఫలితాలు ఇచ్చిందని చెప్పారు. దీని వల్లే ప్రభావం పరిమితంగా ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బ

కరోనా వైరస్ గురువారం నాటికి అమెరికాలోని చాలాచోట్లకు వ్యాప్తి చెందింది. దాదాపు నాలుగు కొత్త రాష్ట్రాలకు అది వ్యాప్తి చెందింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో కేసు నమోదయింది. కరోనా కారణంగా చైనాలో దాదాపు 3వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు లక్షమందికి ఈ వ్యాధి సోకింది.

Economy Might Take a Hit: Trump, US approves $8 billion to fight coronavirus

కరోనావైరస్ పైన పోరాడేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో కాంగ్రెస్ 8 బిలియన్ డాలర్ల మేర నిధులు కేటాయించింది. గురువారం నాటికి అమెరికాలో 57 కరోనా కేసులు నమోదయ్యాయి. కొలరాడో, మేరీలాండ్, టెన్నెస్సీ, టెక్సాస్ తదితర రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

English summary

అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనావైరస్ దెబ్బ: డొనాల్డ్ ట్రంప్ | Economy Might Take a Hit: Trump, US approves $8 billion to fight coronavirus

President Donald Trump said the US economy might take a hit from the coronavirus outbreak but predicted the challenge would eventually pass and defended his handling of the crisis. Trump repeated his assertion that the travel restrictions he imposed on China early in the crisis had helped limit the outbreak in the United States.
Story first published: Friday, March 6, 2020, 14:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X