కరోనా మహమ్మారి కారణంగా అమెరికా, సింగపూర్, సౌదీ అరేబియా, మలేసియా సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. టెక్నాలజీలో ఎంతో ముందుండే జపాన్‌పై కూడా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగానే పడింది. ఈ మహమ్మారి కారణంగా జపాన్ వృద్ధి రేటు వరస్ట్ స్థాయికి పడిపోయింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీ జపాన్. రెండో క్వార్టర్‌లో దీని వృద్ధి రేటు 7.8 శాతం ప్రతికూలత నమోదు చేసింది. ఈ మేరకు జపాన్ కేబినెట్ ఆఫీస్ సోమవారం తెలిపింది.

1980 నుండి దారుణ పతనం
ఆధునిక రికార్డ్స్ ప్రకారం జపాన్‌కు 1980నుండి ఇది అతిపెద్ద, అలాగే వరుసగా మూడో క్వార్టర్ సంకోచం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జపాన్ వృద్ధి దారుణంగా మందగించినప్పటికీ, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన ప్రదర్శన కనబరచడం గమనార్హం. అమెరికా, జర్మనీ దేశాల వృద్ధి అంతకుముందు త్రైమాసికాలతో పోలిస్తే 10శాతం పడిపోగా, బ్రిటిష్ వృద్ధి 20.4శాతం క్షీణించింది. జపాన్ మాత్రం దాదాపు 8 శాతం ప్రతికూలత నమోదు చేసింది.

వినియోగవ్యయం తగ్గడం, ఎగుమతులు పడిపోవడం
G7 దేశాల్లో మిగతా దేశాల విషయానికి వస్తే కెనడా జీడీపీ అంతకుముందు వృద్ధితో పోలిస్తే 12 శాతం పడిపోయింది. కరోనా పుట్టిన చైనా ఆర్థిక వ్యవస్థ రెండో క్వార్టర్‌లో పుంజుకుంది. దాదాపు అన్ని దేశాల మాదిరిగా, జపాన్ జీడీపీ కూడా కరోనా కారణంగా వినియోగవ్యయం తగ్గిపోవడం వల్ల పడిపోయింది. లాక్ డౌన్ ఆంక్షలు, ఎగుమతులు పడిపోవడంతో దెబ్బపడింది.

నేషనల్ ఎమర్జెన్సీ..
ఏప్రిల్, మే నెలల్లో ఆరువారాల పాటు నేషనల్ ఎమర్జెన్సీ కారణంగా ఆ కాలంలో 8.2 శాతం మేర పడిపోయింది. అలాగే, ఇతర దేశాల నుండి ఎగుమతులు భారీగా పడిపోయాయి. ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలలో కనిపించినంత నష్టం జపాన్‌కు జరగలేదు. కానీ వరుసగా మూడో క్వార్టర్‌లో క్షీణత నమోదు చేసింది. అలాగే ఆ దేశానికి గత నాలుగు దశాబ్దాల్లో ఇది అతిపెద్ద క్షీణత. జూన్, జూలైలలో కార్యకలాపాలు తెరుచుకుంటున్నప్పటికీ రికవరీకి సమయం పట్టనుంది.

ఆర్థిక ప్యాకేజీ
భారత్, అమెరికా సహా వివిధ దేశాలు కరోనా ప్యాకేజీలు ప్రకటించాయి. జపాన్ కూడా ప్రకటించిన రెండు రిలీఫ్ ప్యాకేజీ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగుస్తాయి. అదే జరిగితే జపాన్‌లోని చిన్న, మధ్య తరహా ఆర్థిక సంస్థలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జపాన్ కరోనా కేసుల్లో 46వ స్థానంలో ఉంది. మొత్తం కేసులు 55 వేల వరకు ఉండగా, మృతుల సంఖ్య వెయ్యికి పైగా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications