For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Economic Survey 2022: అందుకే పటిష్టస్థితిలో భారత్, ఇంధన ధరల పట్ల అప్రమత్తం.. మరెన్నో

|

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ పైన తక్కువగానే ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ భారత్‌లో వినియోగశక్తిపై ప్రభావం పడలేదని తెలిపింది. కరోనా కారణంగా సేవా రంగం పైన అధిక ప్రభావం పడినట్లు వెల్లడించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (జనవరి 31, 2022) ఆర్థిక సర్వేను లోకసభలో ప్రవేశ పెట్టారు. FY23 రియల్ జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నుండి 8.5 శాతంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతంగా అంచనా వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కరోనా ముందుస్థాయికి చేరుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేసింది.

అందుకే భారత్ పటిష్టస్థితిలో

అందుకే భారత్ పటిష్టస్థితిలో

కరోనా సమయంలోను భారత ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉందని, ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం సమయస్ఫూర్తిగా వ్యవహరించడమే అని ఆర్థిక సర్వే తెలిపింది. ఓ వైపు కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు, మరోవైపు ఆర్థిక వ్యవస్థ మద్దతు చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపింది. కరోనా సమయంలో కేంద్రం చర్యలు గత ఆర్థిక సర్వేలోనే చర్చించినట్లు గుర్తు చేసింది.

భారత్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మరో ముఖ్య కారణం డిమాండ్ నిర్వహణ పైన పూర్తిగా ఆధారపడకుండా, సరఫరా సంస్కరణల వైపు దృష్టి సారించిందని ఆర్థిక సర్వే తెలిపింది.

సరఫరా వైపు సంస్కరణల్లో భాగంగా, అనేక రంగాల నియంత్రణ సడలింపు, ప్రక్రియల సరళీకరణ, రెట్రోస్పెటివ్ ట్యాక్స్ వంటి సమస్యల తొలగింపు, ప్రయివేటీకరణ, ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహకాలు మొదలైనవి ఉన్నట్లు తెలిపింది.

పెరుగుతున్న చమురు ధరల పట్ల అప్రమత్తం

పెరుగుతున్న చమురు ధరల పట్ల అప్రమత్తం

ప్రభుత్వ మూలధన వ్యయంలో పదునైన పెరుగుదల కూడా డిమండ్, సరఫరాను మెరుగుపరిచిన దానికి ప్రతిఫలంగా చూడవచ్చునని ఎకనమిక్ సర్వే చెబుతోంది. ఇది భవిష్యత్తులో మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపింది.

అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్భణం ప్రపంచ సమస్యగా కనిపిస్తోందని పేర్కొంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం ఉంటుందని, ఇలాంటి దిగుమతి ద్రవ్యోల్భణం పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని ఎకనమిక్ సర్వే పేర్కొంది.

సంస్కరణలు..

సంస్కరణలు..

ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల స్థితితో పాటు వృద్ధిని వేగవంతం చేయడానికి సంస్కరణలను కూడా ఈ సర్వే సూచించింది. భారత ఆర్థిక వ్యవస్థ స్థితిని మెరుగుపరిచేందుకు సరఫరా వైపు, సమస్యల వైపు దృష్టి సారించింది. ఆర్థిక సర్వే పలుమార్లు జీడీపీ అంచనాలను మిస్ అయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం నుండి 6.5 శాతం అంచనా వేయగా, మైనస్ 7.3 శాతం నమోదయింది. అయితే కరోనా ప్రభావం చూపింది.

రుణాలు - ఎకనమిక్ సర్వే చిప్ ప్రభుత్వ రుణాలపై

రుణాలు - ఎకనమిక్ సర్వే చిప్ ప్రభుత్వ రుణాలపై

కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని తెలిపింది. పెరిగిన ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఖర్చు తగ్గింపు, నష్టాలను తగ్గించడం, మార్కెట్ అభివృద్ధి వంటి ప్రధాన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ పరిస్థితులకు క్రమబద్దంగా నిర్వహించడానికి సంప్రదాయ, అసాధారణమైన చర్యలు తీసుకున్నాయి ప్రభుత్వాలు.

చిప్ కొరత - చిప్ కొరత ప్రభావం తీవ్రంగా కనిపించిందని పేర్కొంది. సెమీ కండక్టర్ల తయారీకి పెద్ద మొత్తంలో మూలధనం అవసరమని పేర్కొంది. సరఫరా గొలుసు అంతరాయాల నుండి రికవరీ నెమ్మదిగా కనిపిస్తోందని పేర్కొంది.

ఆర్థిక వ్యవస్థకు ఊతం - గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (GFCF) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతంతో బలమైన వృద్ధి సాధిస్తుందని, కరోనా ముందుస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది ఆర్థిక సర్వే. కాపెక్స్, మౌలిక సదుపాయాలకు ఖర్చుల ద్వారా ఆర్థిక వ్యవస్థలో మూలధనాన్ని పెంచిందని, 2021-22లో పెట్టుబడులను జీడీపీ నిష్పత్తికి దాదాపు శాతానికి పెంచిందని, గత ఏడేళ్లలో ఇది అత్యధికమని తెలిపింది.

ఆత్మనిర్భర్ భారత్ - ఆర్థిక సర్వే ఆత్మ నిర్భర్ భారత్‌ను ప్రస్తావించింది. నిర్మాణాత్మక, విధానపరమైన సంస్కరణలు, రికార్డ్ వ్యాక్సీన్స్, కోర్ కాంపిటెన్సీ, అత్యాధునిక సాంకేతికత రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రూపొందించిన వివిధ పీఎల్ఐ స్కీమ్స్, దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు మేక్-ఇన్-ఇండియా కార్యక్రమం, కార్పోరేట్ పన్ను రేటు తగ్గింపుతో సహా ఆత్మనిర్భర్ భారత్ కింద కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేసింది. 2021 నవంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి 1.4 శాతానికి తగ్గింది.

ప్రొడక్షన్ ప్యాటర్న్ మార్పులు, దిగుమతి పాలసీలు, వ్యాక్సినేషన్‌ను మ్యాక్రో ఎకనమిక్ ఇండికేటర్‌గా గుర్తించడం, క్లీన్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ కోసం చర్యలు, రెవెన్యూ పెరుగుదల వంటి అంశాలను టచ్ చేసింది.

English summary

Economic Survey 2022: అందుకే పటిష్టస్థితిలో భారత్, ఇంధన ధరల పట్ల అప్రమత్తం.. మరెన్నో | Economic Survey 2022: India's consumption story is intact despite third wave

One of the reasons that the Indian economy is in a good position is its unique response strategy. Rather than pre-commit to a rigid response, Government of India opted to use safety-nets for vulnerable sections on one hand while responding iteratively based on Bayesian-updating of information.
Story first published: Monday, January 31, 2022, 14:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X