For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎకనమిక్ రికవరీ ఎలా ఉందంటే.. నవంబర్‌లో కీలక సూచీలు డల్‌గానే

|

కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఇటీవల కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. అలాగే, రెండో త్రైమాసికంలో క్షీణత ఊహించినదాని కంటే కాస్త సానుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో వేగవంత రికవరీని అంచనా వేస్తున్నారు. కానీ నవంబర్‌లో హై-ఫ్రీక్వెన్సీ సూచీలు గణనీయమైన పెరుగుదలను చూపించలేదని, అంటే భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోనే ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

ఈ మేరకు 'మింట్' మంత్లీ మాక్రో ట్రాకర్ సర్వేలో పదహారింట 9 అంశాలు నెగిటివ్‌గా లేదా ఆయా రంగాలు గత ఐదేళ్ల సగటు కంటే తక్కువగా ఉన్నాయి. కేవలం ఆరు మాత్రం ఆశాజనకంగా కనిపించాయి. ఒకటి గతంలో మాదిరి ఉంది.

ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ... చైనా మొబైల్స్‌దే హవా: ఎక్కువగా కొనుగోలు చేసింది ఇవేఉద్రిక్తతలు ఉన్నప్పటికీ... చైనా మొబైల్స్‌దే హవా: ఎక్కువగా కొనుగోలు చేసింది ఇవే

లాక్ డౌన్ తర్వాత ఇవి ప్రోత్సాహకరంగా..

లాక్ డౌన్ తర్వాత ఇవి ప్రోత్సాహకరంగా..

అయితే నవంబర్ నెలలో అక్టోబర్ కంటే కాస్త మెరుగు అని తేలింది. అక్టోబర్‌లో 5 ఆశాజనకంగా ఉండగా, నవంబర్ నాటికి 6 ఉన్నాయి. అదే సెప్టెంబర్ నెలలో ఏడు ఉన్నాయి. మింట్ మాక్రో ట్రాకర్ 2018 అక్టోబర్ నుండి ప్రారంభమైంది. నాలుగు రంగాల్లో 16 హై-ఫ్రీక్వెన్సీ సూచీల ఆధారంగా నెలవారీ ఆర్థిక పరిస్థితిని నివేదిస్తుంది. ఆ నాలుగు కన్స్యూమర్ ఎకానమీ, ప్రొడ్యూసర్ ఎకానమీ, ఎక్స్టర్నల్ సెక్టార్, ఈజ్ ఆఫ్ లివింగ్.

కన్స్యూమర్ ఎకానమీ విభాగంలో పాసింజర్ కార్లు, ట్రాక్టర్ అమ్మకాలు అదరగొట్టాయి. పండుగ సీజన్ ముగిసినప్పటికీ ఉత్సాహంగా ఉన్నాయి. లాక్ డౌన్ తర్వాత ఉత్సాహంగా చూపిన సంకేతాల్లో ఈ రెండు ఉన్నాయి. అయితే మొత్తం వాహన రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన కాస్త తక్కువగా ఉన్నాయి.

నెగిటివ్.. పాజిటివ్

నెగిటివ్.. పాజిటివ్

కన్స్యూమర్ ఎకానమీలో పాసింజర్ వెహికిల్స్ ఏడాది ప్రాతిపదికన 10.40, ట్రాక్టర్ సేల్స్ 51.30 పెరిగాయి. బ్రాడ్‌బాండ్ సబ్‌స్క్రైబర్బేస్ 14.10 డొమెస్టిక్ ఎయిర్ పాసింజర్ సేల్స్ 50.93గా ఉన్నాయి.

ప్రొడ్యూసర్ ఎకానమీలో పీఎంఐ కాంపోజిట్, రెయిల్ ఫ్రైట్ ట్రాఫిక్ ఆశాజనకంగా ఉన్నాయి. కోర్ గ్రోత్, బ్యాంక్ నాన్-ఫుడ్ క్రెడిట్ నెగిటివ్‌గా ఉన్నాయి.

ఎక్స్టర్నల్ సెక్టార్‌లో ఇంపోర్ట్ కవర్, లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ ఎక్స్‌పోర్ట్స్ సానుకూలంగా, రూపీ వర్సెస్ డాలర్ నెగిటివ్‌గా ఉంది.

ఈజ్ ఆఫ్ లివింగ్‌లో సీపీఐ, కోర్ సీపీఐ, రియల్ రూరల్ వేజ్ గ్రోత్, జాబ్ ఔట్ లుక్ నెగిటివ్‌గా ఉంది.

విమాన ప్రయాణం క్రమంగా వృద్ధి

విమాన ప్రయాణం క్రమంగా వృద్ధి

బ్రాడ్ బాండ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య, దేశీయ విమాన ప్రయాణ డిమాండ్ ఐదేళ్ల సగటు కంటే తక్కువగా ఉన్నాయి. విమానం ప్రయాణం స్థిరంగా పెరుగుతోంది. నవంబర్ నెలలో దేశీయ విమానయాన సంస్థలు తీసుకు వెళ్తున్న ప్రయాణీకుల సంఖ్య ఏడాది క్రితం స్థాయితో పోలిస్తే సగం ఉంది. కరోనా లాక్ డౌన్ నుండి ఇప్పటి వరకు ఇదే గరిష్టం.

English summary

ఎకనమిక్ రికవరీ ఎలా ఉందంటే.. నవంబర్‌లో కీలక సూచీలు డల్‌గానే | Economic recovery still dicey, key indicators remain dull in November

The Indian economy remained in a slump in November as most high-frequency indicators failed to show any marked improvement. Nine out of a group of 16 such indicators considered in Mint’s monthly macro tracker remain in red, or below their five-year-average trend. Six are in green, or above the five-year-average trend, while one is in line with it.
Story first published: Wednesday, December 30, 2020, 17:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X