For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియా లాక్ డౌన్: అడ్డంకులు ఎదుర్కొంటున్న ఈ-కామర్స్ సంస్థలు, విక్రేతలు

|

దేశంలో లాక్‌డౌన్ నేపథ్యంలో పలుచోట్ల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్స్‌ను కూడా అధికారులు క్లోజ్ చేశారు. ఇది సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తాత్కాలికంగా తమ లాజిస్టిక్ సేవలను నిలిపి వేశాయి. అయితే పోలీసు ఆర్డర్స్ వల్ల 25,000 నుండి 30,000 సూపర్ మార్కెట్లపై ఇది ప్రభావం చూపిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా సప్లై చైన్‌కు ఇబ్బందికరంగా మారుతుంది.

రూ.10,000 వెంటిలెటర్ కేవలం రూ.7,500కే: కరోనాపై పోరుకు మహీంద్రా ఉదారతరూ.10,000 వెంటిలెటర్ కేవలం రూ.7,500కే: కరోనాపై పోరుకు మహీంద్రా ఉదారత

రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా

రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా

ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్, షాపర్స్ స్టాప్ వంటి మార్కెట్స్ గ్రూప్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో వేర్‌హౌస్‌లు మూసివేయడంపై ప్రభుత్వాలకు సందేశం పంపించారు.

ఈ కామర్స్ సంస్థలు

ఈ కామర్స్ సంస్థలు

అమెజాన్ ఈజీ షిప్, సెల్లర్ ఫ్లెక్స్, ఫుల్‌ఫిల్మెంట్ ‌ను సోమవారం నుండి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ లాక్ డౌన్ నేపథ్యంలో సేవలను నిలిపివేసింది. స్నాప్ డీల్ కూడా అత్యవసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

స్థానికంగా ఇబ్బందులు..

స్థానికంగా ఇబ్బందులు..

లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అత్యవసరాలకు మినహాయింపులు ఇచ్చిందని, అయినప్పటికీ ఆహారం, కిరణా, వైద్య సామాగ్రి వంటి ముఖ్యమైన వస్తువుల పంపిణీకి అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. అత్యవసర వస్తువులపై మార్గదర్శకాలు ఉన్నప్పటికీ స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

English summary

ఇండియా లాక్ డౌన్: అడ్డంకులు ఎదుర్కొంటున్న ఈ-కామర్స్ సంస్థలు, విక్రేతలు | e commerce firms halt pickups from vendors

Online and offline retailers across the country faced severe disruptions affecting the supply of essential goods as authorities cracked down by closing warehouses and stores in a bid to curtail the virulent spread of Covid-19.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X