For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్: డుంజో యాప్ హ్యాక్, యూజర్లు ఇప్పుడేం చేయాలి?

|

బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, పుణే, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో డెలివరీ సేవలు అందించే డుంజో శనివారం నాడు తమ డేటా బేస్‌లో భద్రతా ఉల్లంఘన చర్యలు గుర్తించినట్లు తెలిపింది. హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. తమ యూజర్ల ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ అడ్రస్‌లు ఉన్నట్లు తెలిపింది. తమ కంపెనీకి చెందిన థర్డ్ పార్టీ సర్వర్ నుండి ఇది జరిగినట్లు పేర్కొంది. ఈ మేరకు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ముకుంద్ ఝా తెలిపారు.

<strong>వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు ఇకముందు మరింత గండం!</strong>వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు ఇకముందు మరింత గండం!

వెంటనే చర్యలు తీసుకున్నాం

వెంటనే చర్యలు తీసుకున్నాం

దీనిని గుర్తించిన వెంటనే తాము భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యూజర్ల డేటా సురక్షితంగా ఉంచేందుకు మరిన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీనిని సాధ్యమైనంత త్వరగా వినియోగదారులకు వెల్లడించడం తమ బాధ్యతగా భావించామని తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. తాము ఎప్పుడు యూజర్ల డేటా భద్రతకు ప్రాధాన్యతను ఇస్తామని, ఇలా జరిగినందుకు తాము కస్టమర్లకు క్షమాపణ చెబుతున్నామన్నారు. కాగా, ఎన్ని నెంబర్లు బహిర్గతమయ్యాయి, ఏ సర్వర్ నుండి అయితే డేటా ఉల్లంఘన జరిగిందో ఆ థర్డ్ పార్టీ ఎవరో వెల్లడించలేదు.

పెరిగిన సైబర్ దాడులు

పెరిగిన సైబర్ దాడులు

కరోనా మహమ్మారి తర్వాత నుండి ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు, డేటా లీక్స్, డేటా ఉల్లంఘనలు పెరిగాయి. ఇండియాబుల్స్ గ్రూప్ పైన రాన్‍‌సమ్‌వేర్ అటాక్ జరిగినట్లు అమెరికాకు చెందిన సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ సైబిల్ ఇటీవల తెలిపింది. ఈ గ్రూప్‌కు చెందిన అకౌంట్ ట్రాన్సాక్షన్ డిటైల్స్, వోచర్లు, లెటర్స్, బ్యాంకు మేనేజర్లకు పంపించిన లేఖలు వంటి క్రిటికల్ డేటాను బహిర్గతం చేస్తామని హ్యాకర్స్ హెచ్చరించారు.

వినియోగదారులు ఏం చేయాలి

వినియోగదారులు ఏం చేయాలి

డుంజో ఇండియాలోని ప్రధాన నగరాల్లో ప్రముఖ యాప్. లక్షలాది మంది దీనిని వినియోగిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాప్ ప్లే స్టోర్‌లో ఇది అందుబాటులో ఉంది. ఇది గూగుల్ బ్యాక్డ్ యాప్. ఇలాంటి ప్రముఖ యాప్ డేటా బ్రీచ్ జరిగినట్లు ప్రకటించింది. ఉల్లంఘన గురించి పూర్తి వివరాలు లేనప్పటికీ, క్రెడిట్ కార్డ్స్ సమాచారం, ట్రాన్సాక్షన్స్ డిటైల్స్ లేవని తెలిపింది. అయితే ఈ యాప్ యూజర్లు తమ లాగిన్ క్రెడెన్షియల్స్ మార్చుకోవడం మంచిదని అంటున్నారు. ఎప్పుడైనా డుంజోను ఉపయోగించి ఉంటే మీ లాగిన్ క్రెడెన్షియల్స్ మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ-మెయిల్ పాస్ వర్డ్ మార్చితే మరింత సేఫ్ అంటున్నారు.

English summary

షాకింగ్: డుంజో యాప్ హ్యాక్, యూజర్లు ఇప్పుడేం చేయాలి? | Dunzo Delivery App Gets Hacked Exposing User Data

Dunzo, the delivery services startup, said on Saturday it had identified a security breach in a database that exposed phone numbers and email addresses of its users.
Story first published: Sunday, July 12, 2020, 15:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X