For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ దూకుడు... రూ.1,850 కోట్లతో మరో ఫార్మా కంపెనీ ఉత్పత్తుల కొనుగోలు!

|

దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఫార్మా కంపెనీ గా ఉన్న డాక్టర్ రెడ్డీస్ విదేశాలకు ఎగుమతుల్లో మాత్రం మిగితా కంపెనీలకంటే చాలా ముందు ఉంటుంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో డాక్టర్ రెడ్డీస్ బ్రాండ్ కు యమా గిరాకీ ఉంటుంది. అయితే, ఇండియాలో ఈ కంపెనీ అమ్మకాలు ప్రతి ఏటా పెరుగుతున్నా... సన్ ఫార్మా, సిప్లా, మాన్కైండ్, లుపిన్ ఫార్మా లతో పోల్చితే వాటా తక్కువే. కొంత కాలంగా ఇండియన్ డ్రగ్స్ మార్కెట్లో కూడా తన వాటా ను పెంచుకునేందుకు కంపెనీ పలు వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని కంపెనీల బ్రాండ్స్ ను కొనుగోలు చేసిన డాక్టర్ రెడ్డీస్... ఇప్పుడు తాజాగా ఒకార్డ్ ఫార్మా అనే మరో దేశీయ కంపెనీకి చెందిన 62 రకాల మెడిసిన్ బ్రాండ్స్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ లోని బద్ది లో గల ఒక ఫార్మా ప్లాంట్ ను కూడా కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు ఒకార్డ్ ఫార్మా బుధవారం స్టాక్ మార్కెట్ల కు సమాచారం వెల్లడించింది.

రూ 1,850 కోట్ల డీల్...

రూ 1,850 కోట్ల డీల్...

ఒకార్డ్ ఫార్మా కంపెనీ కొంత కాలంగా తీవ్ర మైన అప్పులో ఒత్తిడిలో నలిగిపోతోంది. ఈ నేపథ్యంలో కొన్ని బ్రాండ్ల అమ్మకంతో పాటు బడ్డిలోని ఫార్మా ప్లాంట్ ను విక్రయించాలని నిర్ణయించింది. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ రెడ్డీస్ సంబంధిత ప్రొడక్టుల కొనుగోలుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. తీవ్రమైన ఋణ ఒత్తిడిలో ఉన్న ఒకార్డ్ ఫార్మా... 62 మెడిసిన్ బ్రాండ్లు, బద్ది ప్లాంటు ను ఏకమొత్తంగా రూ 1,850 కోట్లకు విక్రయించేందుకు అంగీకరించింది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అన్ని అనుమతులు లభిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డాక్టర్ రెడ్డీస్ నగదు చెల్లించి ఈ లావాదేవీని పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఒకార్డ్ కు ఋణ ఒత్తిడిల నుంచి ఉపశమనం లభించటంతో పాటు అమెరికా మార్కెట్ కు ఎగుమతి చేసే మందులపై దృష్టి సారించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

రూ 377 కోట్ల ఆదాయం...

రూ 377 కోట్ల ఆదాయం...

ప్రస్తుత డీల్ ద్వారా ఒకార్డ్ ఫార్మా నుంచి డాక్టర్ రెడ్డీస్ కు బదిలీ అయ్యే 62 మెడిసిన్ బ్రాండ్ల నుంచి ఏటా దాదాపు రూ 377 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయం ఒకార్డ్ ఫార్మా మొత్తం ఆదాయంలో సుమారు 15% నికి సమానం కావటం విశేషం. ఇక పై ఈ ఆదాయం డాక్టర్ రెడ్డీస్ కు చెందుతుంది. ఒప్పందం ప్రకారం సంబంధిత బ్రాండ్ల ద్వారా సమకూరే ఆదాయంపై 3.8 రేట్లు అధిక విలువను లెక్కించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి లేదా 2020 మే నెల వరకు పూర్తి లావాదేవిని పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో ఉన్న సంస్థనే కావటంతో పాటు, కంపెనీ వద్ద తగినంత నగదు నిల్వలు ఉండటం దానికి కలిసొచ్చే అంశంగా అనలిస్టులు భావిస్తున్నారు.

రూ 15,000 కోట్ల కంపెనీ...

రూ 15,000 కోట్ల కంపెనీ...

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డాక్టర్ రెడ్డీస్ కు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు అమెరికా, యూరోప్ సహా అనేక దేశాల్లో ఫార్మా ప్లాంట్లు ఉన్నాయి. ప్రతి ఏటా ఈ కంపెనీ ఒక బిలియన్ డాలర్ల కంటే అధిక రెవిన్యూ కేవలం అమెరికా మార్కెట్ నుంచే నమోదు చేస్తుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డాక్టర్ రెడ్డీస్ రూ 15,385 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీనిపై రూ 1,880 కోట్ల నికర లాభాన్ని వెల్లడించింది. వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తూ దేశంలో సన్ ఫార్మా, అరబిందో ఫార్మా ల తర్వాత మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో బుధవారం డాక్టర్ రెడ్డీస్ షేర్లు స్వల్ప లాభంతో రూ 3,197.55 వద్ద క్లోజ్ అయ్యాయి.

English summary

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ దూకుడు... రూ.1,850 కోట్లతో మరో ఫార్మా కంపెనీ ఉత్పత్తుల కొనుగోలు! | Dr Reddy's will acquire 62 products and Wockharrdt's Baddi plant

Dr Reddy's Laboratories will acquire 62 products and Wockharrdt's Baddi plant which is located in Himachal Pradesh in a slump sale for a consideration of Rs 1,850 crore. The business which is being transferred, reported revenue from operations of Rs 377 crore, which is 15% of the consolidated revenue of Wockharrdt.
Story first published: Wednesday, February 12, 2020, 21:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X