For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే తీవ్రంగా నష్టపోతారు..

|

చాలా మంది తమ పర్సనల్ ఫైనాన్స్ జర్నీని ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియక ఆలోచన దగ్గరే ఆగిపోతుంటారు. భవిష్యత్తులో మంచి రాబడిని ఇచ్చే వాటిపై పెట్టుబడి పెట్టడం ఈ క్రమంలో చాలా ముఖ్యమైనదని గుర్తించాలి. పైగా భవిష్యత్తులో ఆదాయాన్ని సంపాదించే సామర్థ్యాన్ని రక్షించడం కూడా చాలా ముఖ్యమైనది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మంచి ఫైనాన్సియల్ ఇన్ష్రుమెంట్. కానీ దీనిని చాలా మంది సరిగా వినియోగించుకోరు. ప్రజలు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు చేసే ముఖ్యమైన తప్పులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. సాధారణంగా ఎవరినైనా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా అని అడిగితే.. చాలా మంది చెప్పే సమాదానం ఏమిటంటే.. నాకు చాలా పాలసీలు ఉన్నాయని అంటుంటారు. ఎక్కువ పాలసీలు ఉంటే తగినంత ఇన్సూరెన్స్ రక్షణ ఉన్నట్లు కాదని ప్రజలు గుర్తుంచుకోవాలి. మీ సమ్ ఎస్యూర్డ్(బీమా హామీ మెుత్తం) భవిష్యత్తు అవసరాలను, ఆర్థిక లక్ష్యాలను తీర్చేవిగా ఉండాలి. ఎండోమెంట్ పాలసీల్లో చాలా వరకు తక్కువ రాబడిని ఇస్తుంటాయి. యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు లేదా యులిప్‌లు స్వల్పంగా మెరుగ్గా ఉన్నప్పటికీ.. ప్రారంభ సంవత్సరాల్లో అవి అధిక ఖర్చులను కలిగి ఉంటాయి. చాలా మంది ఇన్సూరెన్స్, పెట్టుబడులను కలిపి చేయటం వల్ల ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు.

2. పిల్లలు లేదా మనవళ్ల పేరు మీద ఇంట్లోని వారు ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయటం చాలా మంది సాధారణంగా చేసే తప్పు. వీటిలో కాక్ ఇన్ పిరియడ్ ఉండే దీర్ఘకాలిక ఉత్పత్తుల్లో పెట్టుబడి పెడుతుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కుటుంబానికి భవిష్యత్తు ఆదాయాలు లేదా ఇప్పటికే ఉన్న బాధ్యతల నష్టం నుండి కవర్ చేయడానికి మాత్రమే అవసరం. పిల్లలకి రెండూ ఉండవు కాబట్టి వారి పేరుపై పాలసీ తీసుకోవటం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

dont do these mistakes while purchasing a life insurance policy that makes you loose heavily

3. చాలా మంది చేసే మరో తప్పు ఏమిటంటే.. "ప్రీమియంలు వృధా అవుతాయి-నాకు డబ్బు తిరిగి రాదు" అనే సాకులు చెబుతుంటారు. ఇలాంటి వారు బైక్ లేదా కార్ ఇన్సూరెన్స్ చెల్లించేందుకు మాత్రం సిద్ధమవుతుంటారు. ఇలాంటి వారి కోసం రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉత్పత్తులను సైతం కంపెనీలు ప్రారంభించాయి. 20 లేదా 25 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించిన ప్రీమియం ద్రవ్యోల్బణం కారణంగా దాదాపు మొత్తం విలువను కోల్పోయిందని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు.

4. చాలా సార్లు ప్రజలు నాకు ఇప్పుడు అవసరం లేదు నాకు ఏమీ జరగదు అనే ఆలోచనలో టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలును వాయిదా వేసుకుంటుంటారు. ఇందులో గ్రహించాల్సిన విషయం ఏమిటంటే.. వయస్సు తక్కువగా ఉన్నప్పుడు చెల్లించాల్సిన ప్రీమియం కూడా తక్కువగా ఉన్నప్పటికీ తరువాత అవి గణనీయంగా పెరుగుతాయి. ఆరోగ్యం చెడిపోయినా పాలసీదారులు భారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ పాలసీలను కొనుగోలు చేయడం ఉత్తమం.

5. ప్రజలు చేసే మరో ఘోరమైన తప్పు ఏమిటంటే.. పాలసీ తీసుకునేటప్పుడు తప్పుడు సమాచారాన్ని అందించటం. ఉదాహరణకు.. హెల్త్ లేదా ఇతర అలవాట్లకు సంబంధించిన సమాచారం తప్పుగా ఇవ్వటం. ఈ విషయాన్ని బీమా కంపెనీ గుర్తించినట్లయితే పాలసీని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఈ తప్పుల వల్ల నిజంగా కుటుంబానికి అవసరమైన సమయంలో డబ్బు అందుబాటులో ఉండకపోవచ్చు.

dont do these mistakes while purchasing a life insurance policy that makes you loose heavily

6. చివరగా చాలా మంది కరోనా సమయంలో ఎదుర్కొన్న సమస్య గురించి చూద్దాం. హోమ్ లోన్ కవర్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా మంది తెలియక తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే.. కేవలం ఐదు సంవత్సరాలకు మాత్రమే కవర్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే. చాలా మంది కరోనా సమయంలో చనిపోయినప్పుడు కంపెనీలు వారి కుటుంబ సభ్యులను చెల్లింపులు చేయాలని కోరాయి. ఇలా అనేక మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్సూరెన్స్ రెన్యూవల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఇలాంటి అంతర్గత విషయాలపై అవగాహన లేనప్పుడు సరైన ఆర్థిక సలహాదారు సలహాలు చేసుకోవటం చాలా ముఖ్యం. జీవితంలో చాలా విలువైన సమయాన్ని వృధా చేసుకున్న తరువాత ప్రజలు వీటిని గ్రహిస్తుంటారు. పైగా చేసిన పొరపాట్లకు ఎక్కువ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.

English summary

లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే తీవ్రంగా నష్టపోతారు.. | dont do these mistakes while purchasing a life insurance policy that makes you loose heavily

know about Common mistakes that people make in buying a life insurance policy
Story first published: Monday, June 20, 2022, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X