For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Milk: ఖరీదైన పాలు.. లీటర్ ధర రూ.7,000.. దేశవిదేశాల్లో సూపర్ డిమాండ్..!

|

Milk: పాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆరోగ్యానికి సైతం మేలు చేసే పాలను టీ నుంచి కాఫీ వరకు ప్రతిదానిలో ఉపయోగిస్తాం. పనీర్, కోవా వంటి అనేక ఆహార పదార్థాలను పాలతో తయారు చేయటం సహజం. అయితే లీటరు పాల ధర రూ. 7 వేలు అని విన్న ప్రతివారికీ ఆశ్చర్యం కలగక మానదు. అసలు దీని వెనుక ఉన్న అసలు విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అత్యంత ఖరీదైన పాలు..

అత్యంత ఖరీదైన పాలు..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాల గురించి. అవును అవే గాడిద పాలు. అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వీటి ధర ఇంత భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో వీటికి అధికంగా డిమాండ్ ఉంది. అక్కడ లీటర్ పాల ధర రూ.160 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీ రేటు ప్రకారం రూ.13 వేలు లీటర్ ధర. దీంతో మన దేశంలో ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మన దేశంలోని కొన్ని నగరాల్లో ఈ పాల లీటర్ ధర దాదాపు రూ.7 వేలుగా ఉంది.

ఎందుకింత ఖరీదు..

ఎందుకింత ఖరీదు..

గాడిద పాల వల్ల ఆరోగ్యవంతమైన చర్మంతో పాటు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుందని ఆధునిక పరిశోధనల్లో తేలింది. నిత్యం గాడిద పాలను తీసుకుంటే అనేక రోగాలను దూరమవుతాయి. ఈ కారణంగానే గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే వీటి ఉత్పత్తి మార్కెట్లో డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉంది. అందువల్ల ధర విపరీతంగా పెరిగింది. దేశంలోని కొన్ని చోట్ల ఈ తరం యువకులు గాడిదల పెంపకం ద్వారా పాలను అమ్మి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

గాడిద పాల ఉత్పత్తులు..

గాడిద పాల ఉత్పత్తులు..

గాడిద పాలను అనేక ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో దీనిని అనేక సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నారు. గాడిద పాలను పెరుగు, చీజ్ వంటి అనేక పాల పదార్థాలు తయారు చేస్తున్నారు. గాడిద పాలు చర్మానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుందని రుజువు అయింది. వీటికి తోడు రక్తంలో చక్కెర, రక్త ప్రసరణ వంటి సమస్యలను కూడా అధిగమించగలదని తేలింది.

ప్రత్యేకంగా పిల్లలకు..

ప్రత్యేకంగా పిల్లలకు..

వైద్యుల ప్రకారం చిన్న పిల్లలకు గాడిద పాలు తాగించటం శతాబ్దాలుగా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇందులో ఉండే పోషకాలు అలర్జీలను దూరం చేస్తాయి. అలాగే తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం మెరుగైన ఆరోగ్యం కోసం ఈ పాలను తీసుకోవచ్చని సూచనలు చేయటం దీని డిమాండ్ పెరగటానికి కారణాలుగా ఉన్నాయి.

English summary

Milk: ఖరీదైన పాలు.. లీటర్ ధర రూ.7,000.. దేశవిదేశాల్లో సూపర్ డిమాండ్..! | Donkey Milk 0ne liter costs 7000 rupees has high demand abroad

Donkey Milk 0ne liter costs 7000 rupees has high demand abroad
Story first published: Friday, November 18, 2022, 17:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X