For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన ధరలు... ఖర్చు, భారీగా పడిపోయిన ఆటో సేల్స్! ఆటో ఎక్స్‌పో, నిర్మల ప్రకటనపై ఆశలు

|

జనవరి నెలలో డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 6.2 శాతం మేర తగ్గాయి. ఓనర్‌షిప్ వ్యయం పెరగడంతో పాటు జీడీపీ వృద్ధి రేటు మందగింపు వంటి వివిధ కారణాలతో ఈ సేల్స్ పడిపోయాయినట్లుగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ SIAM సోమవారం వెల్లడించింది. 2019 జనవరి నెలలో ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 2,80,091 ఉండగా, ఈ ఏడాది జనవరిలో 2,62,714కు తగ్గాయి.

అలా చేయకుంటే మీ టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది, 5 కీలక నిబంధనలుఅలా చేయకుంటే మీ టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది, 5 కీలక నిబంధనలు

8.1 శాతం తగ్గిన కారు సేల్స్

8.1 శాతం తగ్గిన కారు సేల్స్

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యూఫ్యాక్చరర్స్ (SIAM) ప్రకారం జనవరి నెలలో కారు సేల్స్ కూడా 8.1 శాతం తగ్గిపోయాయి. గత ఏడాది జనవరిలో ఈ సేల్స్ 1,79,324 యూనిట్లు కాగా, ఈ జనవరిలో 1,64,793 యూనిట్లకు పడిపోయాయి.

అందుకే తగ్గాయి

అందుకే తగ్గాయి

అన్ని కేటగిరీల్లో కలిపి వాహనాల సేల్స్ జనవరి నెలలో 13.83 శాతం మేర తగ్గిపోయాయి. 2019 జనవరిలో అన్ని రకాల వెహికిల్ సేల్స్ 20,19,253 కాగా, ఇప్పుడు 17,39,975 యూనిట్లుగా ఉన్నాయి. వాహనాల సేల్స్ తగ్గడానికి వాహన యాజమాన్య ఖర్చులు పెరగడం, జీడీపీ వృద్ధి రేటు మందగించడం వంటి కారణాలు ఉన్నాయని SIAM ప్రెసిడెంజ్ రాజన్ వాధేరా అన్నారు.

ఇవీ కారణమే

ఇవీ కారణమే

ఏప్రిల్ 1వ తేదీ నుంచి BS-IV నుండి BS-VIకు మారాల్సిన నేపథ్యం కూడా సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణం. BS-VI మారాల్సిన పరిస్థితుల్లో వాహనాల ధరలు పెరుగుతున్నాయి. ఇన్‌పుట్ కాస్ట్స్ పేరుతో జనవరి నెల నుంచి వివిధ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ధరలు పెరగడం కూడా సేల్స్ తగ్గడానికి ఓ కారణంగా భావిస్తున్నారు.

బడ్జెట్ ఎఫెక్ట్.. ముందు సేల్స్ పెరగొచ్చు

బడ్జెట్ ఎఫెక్ట్.. ముందు సేల్స్ పెరగొచ్చు

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో మౌలిక రంగానికి, గ్రామీణ భారతానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, నిర్మలా సీతారామన్ ప్రకటన నేపథ్యంలో ముందు ముందు సేల్స్ బాగుంటాయని భావిస్తున్నట్లు రాజన్ వాధేరా అన్నారు. ముఖ్యంగా కమర్షియల్ వెహికిల్స్, టూ వీలర్స్ వాహనాల అమ్మకానికి కేంద్రం ప్రకటనలు ఉపయోగపడతాయన్నారు.

టూవీలర్స్ సేల్స్ ఎంత తగ్గాయంటే

టూవీలర్స్ సేల్స్ ఎంత తగ్గాయంటే

SIAM ప్రకారం.. జనవరి నెలలో టూవీలర్ సేల్స్ 16.06 శాతం మేర తగ్గాయి. గత ఏడాది జనవరిలో 15,97,528 యూనిట్లు అమ్ముడు కాగా, ఇప్పుడు 13,41,005 అమ్ముడయ్యాయి. మోటార్ సైకిల్స్ 15.17 శాతం తగ్గాయి. 10,27,766 యూనిట్ల నుండి 8,71,886 యూనిట్లకు తగ్గాయి. స్కూటర్ సేల్స్ 16.21 శాతం తగ్గుదలతో కనిపించింది. 4,97,169 యూనిట్ల నుండి 4,16,594 యూనిట్లకు తగ్గాయి.

ఆటో ఎక్స్‌పై ఆశలు

ఆటో ఎక్స్‌పై ఆశలు

కమర్షియల్ వెహికిల్ సేల్స్ 14.04 శాతం మేర తగ్గి 87,591 నుండి 75,289కు పడిపోయాయి. ఆటో ఎక్స్‌పో కారణంగా వినియోగదారుల సెంటిమెంట్ బలపడుతుందని భావిస్తున్నామని, తద్వారా సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

పెరిగిన మారుతీ సేల్స్, తగ్గిన మహీంద్రా, హ్యుండాయ్ సేల్స్

పెరిగిన మారుతీ సేల్స్, తగ్గిన మహీంద్రా, హ్యుండాయ్ సేల్స్

మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన పాసింజర్ వెహికిల్ సేల్స్ 0.29 శాతం పెరిగాయి. 1,39,844 యూనిట్లు అమ్ముడు పోయాయి. అదే సమయంలో హ్యుండాయ్ మోటార్స్ సేల్స్ 8.3 శాతం మేర తగ్గి 42,002 యూనిట్లకు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 17.05 శాతం మేర తగ్గి 19,794 యూనిట్లకు పడిపోయాయి.

టూవీలర్స్ కంపెనీల సేల్స్ ఎలా ఉన్నాయంటే?

టూవీలర్స్ కంపెనీల సేల్స్ ఎలా ఉన్నాయంటే?

టూవీలర్స్ విషయానికి వస్తే హీరో మోటో కార్ప్ సేల్స్ 14.37 శాతం తగ్గి 4,88,069 యూనిట్లకు పడిపోయాయి. హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా సేల్స్ 6.63 శాతం మేర తగ్గి, 3,74,114 యూనిట్లకు పరిమితమయ్యాయి. చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్ 28.72 శాతం తగ్గి 1,63,007 యూనిట్లకు పడిపోయాయి.

English summary

పెరిగిన ధరలు... ఖర్చు, భారీగా పడిపోయిన ఆటో సేల్స్! ఆటో ఎక్స్‌పో, నిర్మల ప్రకటనపై ఆశలు | Domestic passenger vehicle sales drop 6.2 pc in January

Domestic passenger vehicle sales declined 6.2 per cent in January as vehicle demand continued to be stressed by rising cost of ownership and slower GDP growth, automobile industry body SIAM said on Monday.
Story first published: Monday, February 10, 2020, 13:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X