For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి, ఢిల్లీలో రూ.1000 క్రాస్

|

డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడిపై మరింత భారం పడింది. ఇంటి అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర మళ్లీ పెరిగాయి. అయితే స్వల్పంగా మాత్రమే పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర పైన రూ.3.50 పెంచారు. కమర్షియల్ సిలిండర్ ధర రూ.8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

ఇప్పటికే నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇది సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ.3.50 పెరిగింది. దీంతో ఇక్కడ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 మార్కు దాటింది.

Domestic LPG prices hiked again, cross RS 1,000 mark in Delhi

నాన్ సబ్సిడీ కుకింగ్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1003గా ఉంది. అంతకుముందు మే 7వ తేదీన గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. అంతకుముందు మార్చి 22న అంతే ధర పెరిగింది. మే 1వ తేదీన 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ఎల్పీజీ ధర రూ.102.50 పెరిగి రూ.2355.50కి చేరుకుంది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2307గా ఉంది.

English summary

గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి, ఢిల్లీలో రూ.1000 క్రాస్ | Domestic LPG prices hiked again, cross RS 1,000 mark in Delhi

Domestic cooking gas LPG prices has been increased by ₹ 3.50 per cylinder on Thursday. This is the second hike in May, taking LPG price above the ₹ 1,000 mark.
Story first published: Thursday, May 19, 2022, 11:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X