For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ ఇన్వెస్టర్లూ! జాగ్రత్త.. ఎకానమీతో సంబంధం లేకుండా పెరుగుదల: ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక

|

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. దేశ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా పెరుగుతున్న సీచూలకు కరెక్షన్ తప్పదని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ దిద్దుబాటు ఎప్పుడు ఉంటుందనే విషయం చెప్పడం కష్టమన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అంతర్జాతీయంగా నిధుల లభ్యత భారీగా పెరగడమే ప్రస్తుత స్టాక్ మార్కెట్ జోరుకు కారణమని తెలిపారు. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ పతనంతో ఆర్థిక వ్యవస్థపై ఉండే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.

కరోనా టైంలో సీనియర్ ఉద్యోగులకే డిమాండ్, భారీ వేతనాలు

అందుకే స్టాక్స్ ధరలు పెరిగాయి

అందుకే స్టాక్స్ ధరలు పెరిగాయి

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకులు లిక్విడిటీని ఇంజెక్ట్ చేశాయని, ఇందుకు భారత్ భిన్నం కాదని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. మిగులు ద్రవ్యత ప్రపంచవ్యాప్తంగా అసెట్స్ ధరలను పెంచుతుందన్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా కరెక్షన్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి సెంట్రల్ బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలు వ్యవస్థలోకి పెద్ద ఎత్తున నగదును పంపించిందని, ఇది స్టాక్ ధరల పెరుగుదలకు కారణమైందన్నారు. అంటే వాస్తవ ఆర్థిక వ్యవస్థతో డిస్‌కనెక్ట్ అయిందన్నారు.

6 ట్రిలియన్ డాలర్ల మేర ఇంజెక్ట్

6 ట్రిలియన్ డాలర్ల మేర ఇంజెక్ట్

భవిష్యత్తులో దిద్దుబాటు(కరెక్షన్) ఉంటుందని, అది ఎప్పుడో చెప్పలేమని, ఆర్థిక రంగాల కోణం నుండి దానిని తాము గమనిస్తున్నామని, ఆర్థిక స్థిరత్వం కొనసాగడానికి చర్యలు తీసుకుంటున్నామని శక్తికాంత దాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు 6 ట్రిలియన్ డాలర్ల మేర వ్యవస్థలోకి నగదును జొప్పించాయి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని నిరోధించేందుకు వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు కొన్ని దేశాలు దాదాపు జీరోకు తీసుకు వచ్చాయి. కరోనా చర్యల్లో భాగంగా ఆర్బీఐ దాదాపు రూ.10 లక్షల కోట్లను మార్చి నుండి వ్యవస్థలోకి ఇంజెక్ట్ చేసింది.

కాగా, ఎక్కువగా సంస్థేతర పెట్టుబడిదారులచే నడిచే ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇండెక్స్, బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా 37శాతం, 35శాతం పెరిగాయి. మార్చి చివరివారంలో కరోనా కారణంగా రికార్డ్ స్థాయిలో నష్టపోయిన మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. ఇటీవల ఐదు నెలల గరిష్టాన్ని తాకాయి. మార్చి 1వ తేదీ నుండి ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్స్ రూ.15,300 కోట్ల పెట్టుబడుు పెట్టారు.

వ్యాపారాలు బాగుంటే రుణాలు చెల్లింపు, ఉద్యోగాలు సేఫ్

వ్యాపారాలు బాగుంటే రుణాలు చెల్లింపు, ఉద్యోగాలు సేఫ్

వడ్డీ రేట్ల మార్పులపై ఆర్బీఐ గవర్నర్ హింట్ ఇచ్చారు. అయితే ఇది కరోనా ప్రభావం పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అనిశ్చితి అతిపెద్ద సవాల్ అని, ఇది వ్యాక్సీన్ రాకపై ఆధారపడి ఉందన్నారు. బ్యాంకులు, డిపాజిటర్స్ ఆర్థిక ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆర్బీఐ రిజల్యూషన్ ప్రేమ్ వర్క్‌ను రూపొందించిందని చెప్పారు. కరోనా కారణంగా వ్యాపారాలు ఒత్తిడికి లోనయ్యాయని, అవి ఫెయిల్ అయితే అది ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుందన్నారు. వ్యాపారాలు బాగుంటే వారు తిరిగి రుణాలు చెల్లిస్తారని, ఉద్యోగాలను కాపాడటం లేదా సృష్టించడం జరుగుతుందన్నారు. నగతు కొరత ఉన్న వ్యాపారులకు రుణ పునర్వ్యవస్థీకఱణ మంచి ఊరట అన్నారు. లాక్ డౌన్ వల్ల కలిగిన సమస్యలకు మారటోరియం తాత్కాలిక పరిష్కారం అన్నారు.

English summary

Disconnect between economy and stock markets: RBI Governor

RBI Governor Shaktikanta Das on Friday said there was a clear disconnect between the sharp surge in stock markets and the state of real economy, as surplus global liquidity was driving up asset prices across the world.
Company Search