For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jan Dhan Accounts: జన్ ధన్ అకౌంట్ డిపాజిట్స్ రూ.1.5 లక్షల కోట్లు

|

దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో ఏడేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు రూ.1.5 లక్షల కోట్లను క్రాస్ చేశాయి. 2014 ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుండి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. జన్ ధన్ ఖాతాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం 2021 డిసెంబర్ నెలాఖరు నాటికి రూ.44.23 కోట్ల ఖాతాల్లో రూ.1,50,939.36 కోట్ల నిధులు సమకూరినట్లు కేంద్ర ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి.

44.23 కోట్ల ఖాతాల్లో రూ.34.9 కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకులు, 8.05 కోట్లు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 1.28 కోట్ల ఖాతాలు ప్రయివేటు బ్యాంకులు. ఇందులో 31.28 కోట్ల PMJDY లబ్ధిదారులకు రూపే కార్డులు జారీ చేసినట్లు తెలిపింది. ఇందులో అత్యధికంగా రూపే కార్డులను ఉపయోగిస్తున్నారు. మొత్తం జన్ ధన్ ఖాతాల్లో 29.54 కోట్ల ఖాతాలు గ్రామీణ, సెమీ అర్బన్ బ్యాంకు శాఖల పరిధిలో ఉన్నాయి.

Deposits In Jan Dhan Accounts, Cross Rs 1.5 Lakh Crore

2021 డిసెంబర్ 29వ తేదీ నాటికి 24.61 కోట్ల మంది మహిళలకు జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. తొలి ఏడాది 17.90 PMJDY ఖాతాలను ప్రారంభించారు. 2021 డిసెంబర్ 8వ తేదీ నాటికి 3.65 కోట్ల ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలు, జన్ ధన్ ఖాతాల్లో స్కాలర్‌షిప్స్, సబ్సిడీలు, పెన్షన్, కొవిడ్ రిలీఫ్ ఫండ్స్ వంటి బెనిఫిట్స్ సొమ్ము నేరుగా ప్రత్యక్ష నగదు బదలీ ద్వారా జమ అవుతాయి.

English summary

Jan Dhan Accounts: జన్ ధన్ అకౌంట్ డిపాజిట్స్ రూ.1.5 లక్షల కోట్లు | Deposits In Jan Dhan Accounts, Cross Rs 1.5 Lakh Crore

Deposits in bank accounts opened under the Jan Dhan scheme, launched about seven and half years ago by the government, have crossed the Rs 1.5 lakh crore mark. As per the latest finance ministry data, the total balance in over 44.23 crore (PMJDY) accounts was at Rs 1,50,939.36 crore at December end, 2021.
Story first published: Monday, January 10, 2022, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X