For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా దెబ్బ: 15 రోజుల్లో రూ.53,000 కోట్ల నగదు ఉపసంహరణ

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు బ్యాంకుల నుండి నగదు ఉపసంహరణ ఎక్కువగా తీసుకుంటు్ననారట. మార్చి 13తో ముగిసిన తొలి పక్షం రోజుల్లో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నిధుల్లో రూ.53వేల కోట్ల నిధులు ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ నివేదిక తెలిపింది. సాధారణంగా పండుగలు, ఎన్నికల లేదా ఇతర ప్రత్యేక సందర్భాలలో బ్యాంకుల నుండి ఎక్కువగా ఉపసంహరణలు జరుగుతుంటాయి.

ఇప్పుడు కరోనాతో తలెత్తిన ఇబ్బందుల నుండి బయటపడేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి నగదు వెనక్కి తీసుకుంటున్నారు. గత పదిహేను రోజుల్లో రూ.53వేలు వెనక్కి తీసుకున్న ప్రజలు.. గత 16 నెలల కాలంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో నగదును తీసుకోలేదు. దీంతో ప్రజల దగ్గర చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ.23 లక్షల కోట్లకు చేరింది.

కరోనా వైరస్: ఎక్కువ కరెన్సీ ముద్రించి పేదలకు పంచుతారా?కరోనా వైరస్: ఎక్కువ కరెన్సీ ముద్రించి పేదలకు పంచుతారా?

Depositors withdraw Rs 53,000 crore cash in 15 days

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వచ్చే నెల ఏప్రిల్ నెలలోను కొనసాగనున్న నేపథ్యంలో డబ్బులకు కొరత ఉంటుందన్న భయాలు ప్రజల్లో నెలకొన్నాయి. దీంతో ఈ నెల 13తో ముగిసిన తొలి పక్షం రోజుల్లో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నిధుల్లో రూ.53 వేలకోట్ల నిధులను ఉపసంహరించుకున్నారట.

డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలివ్వడం లేదు. భారతీయులు కరెన్సీ రూపంలోనే అత్యధికంగా ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారని ఆర్బీఐ నివేదిక తెలిపింది. మార్చి 13వ తేదీ నాటికి ప్రజల వద్ద రూ.23 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా బ్యాంకుల శాఖలు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ కష్టమవుతున్నదన్న అంచనాతో ఎక్కువ మంది నగదును ఉపసంహరించుకున్నారని యాక్సిస్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త తెలిపారు.

English summary

కరోనా దెబ్బ: 15 రోజుల్లో రూ.53,000 కోట్ల నగదు ఉపసంహరణ | Depositors withdraw Rs 53,000 crore cash in 15 days

Indians have been withdrawing cash from banks this month to prepare themselves for likely emergencies, with the Covid-19-induced shutdown in the last week of the month putting the spotlight on access to essential goods for billion plus consumers.
Story first published: Sunday, March 29, 2020, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X