For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గృహోపకరణాల డిమాండ్ ఉంది: ఉత్పత్తి ఏది? కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్

|

కరోనా లాక్ డౌన్ దెబ్బకు అన్ని పరిశ్రమలు కుదేలయ్యాయి. గృహోపకరణాల ఉత్పత్తికి సంబంధించి పనిచేసే పరిశ్రమలన్నీ లాక్ డౌన్ ప్రభావంతో మూతపడ్డాయి. దీంతో మానవుల అవసరాలకు తగిన గృహోపకరణాల ఉత్పత్తి జరగలేదు. ఇక కరోనా లాక్ డౌన్ సడలింపు లనుండి కాస్త ఉపశమనం లభించడంతో వినియోగదారులు గృహోపకరణాల కొనుగోలుకు బారులు తీరుతున్నారు. షాపులో ఉన్న స్టాక్ మినహాయించి కొత్తగా స్టాక్ రాకపోవడంతో విక్రేతలు డిమాండ్ కు తగినట్లుగా సప్లై లేదని,అసలు కంపెనీలలోనే ప్రొడక్షన్ లేదని లబోదిబోమంటున్నారు.

గృహోపకరణాల కొనుగోళ్లకు వినియోగదారుల ఆసక్తి

గృహోపకరణాల కొనుగోళ్లకు వినియోగదారుల ఆసక్తి

కరోనా లాక్ డౌన్ నిబంధనల నుండి వెసులుబాటు కల్పించడంతో దేశవ్యాప్తంగా మార్కెట్లలో కొనుగోళ్ల కళ కనిపిస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో గృహోపకరణాల విక్రయాలు, కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. ఇక ముఖ్యంగా ఎండాకాలం కావడంతో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ లు టాప్ త్రీ లో నిలువగా మిగతా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో పనిమనుషులు కూడా రాకపోవడంతో చాలామంది డిష్ వాషర్ లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో డిష్ వాషర్ లకు డిమాండ్ బాగా పెరిగింది.

ట్యాబ్ లకు , ఇన్వర్టర్ లకు పెరిగిన డిమాండ్

ట్యాబ్ లకు , ఇన్వర్టర్ లకు పెరిగిన డిమాండ్

ఇక మరో పక్క స్కూళ్ళు, కాలేజీలు ఇంకా తెరుచుకోకపోవడంతో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి చాలా కాలేజీలు,స్కూళ్ళు. ఇక ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల కోసం ట్యాబ్ ల గిరాకీ బాగా పెరిగింది. అంతేకాదు ఇప్పటికే సాఫ్ట్ వేర్ తో ముడిపడిన అనుబంధ రంగాల వారు వర్క్ ఫ్రం హోం పనిచేస్తున్నారు. ఇక ఈ సమయంలో కరెంటు పోతే ఇబ్బందులు ఎదురవు తున్న నేపథ్యంలో ఇన్వర్టర్ ల కొనుగోలుకు చాలా మంది వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

గృహోపకరణాల కోసం 300 శాతం డిమాండ్

గృహోపకరణాల కోసం 300 శాతం డిమాండ్

కరోనా లాక్ డౌన్ కొనసాగిన నేపథ్యంలో పనులు లేక ఇళ్లకే పరిమితం అయిన చాలామంది ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో అత్యవసరం మినహాయించి, మిగతా అవసరాలపై ప్రజలు దృష్టి పెట్టరని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. గృహోపకరణాల కోసం 300 శాతం డిమాండ్ పెరిగింది కానీ వస్తువులు తయారుచేసే పరిశ్రమలు కరోనా లాక్ డౌన్ సమయంలో మూతపడడంతో ప్రొడక్షన్ నిలిచిపోయింది.

కొనుగోళ్ళపై వినియోగదారుల ఆసక్తి .. డిమాండ్ కు తగిన సప్లై లేక తిప్పలు

కొనుగోళ్ళపై వినియోగదారుల ఆసక్తి .. డిమాండ్ కు తగిన సప్లై లేక తిప్పలు

చాలా పరిశ్రమలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కానీ చాలా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్ళటంతో పరిశ్రమల్లో మానవ వనరుల కొరత నెలకొంది. అంతేకాదు ఇంకా పూర్తిగా లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయని కారణంగా సప్లై లో కూడా ఇబ్బంది తలెత్తుతుంది . దీంతో ఇప్పుడు డిమాండ్ కు తగిన సప్లై లేక , పరిశ్రమల్లో ఉత్పత్తి లేక అటు హోల్ సేల్, రిటైల్ రంగం లాక్ డౌన్ ఆంక్షల నుండి మినహాయింపు పొందినప్పటికీ పెద్దగా బిజినెస్ చేయలేకపోతోంది.

Read more about: production sales workers market
English summary

గృహోపకరణాల డిమాండ్ ఉంది: ఉత్పత్తి ఏది? కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ | Demand for home appliances .. No production in lockdown time

Markets are dealing with purchases as the corona lockdown restrictions relaxed. Demand for home appliances has increased by 300 percent but production has come to a standstill as the manufacturing industry has been shut down with Corona Lockdown.
Story first published: Wednesday, May 27, 2020, 17:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X