For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఢిల్లీ టు: ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్: హైబ్రీడ్ టికెట్ల వ్యవస్థ: కార్డులు, క్యూఆర్ కోడ్స్

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్‌లో అత్యాధునికమైన టికెట్ల జారీ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇదివరకెప్పుడూ లేని సిస్టమ్ ఇది. ఢిల్లీ-మీరట్ ఆర్‌ఆర్‌టీఎస్ రైలులో ప్రయాణించాలంటే.. కార్డులు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. డిజిటల్ క్యూఆర్, పేపర్ క్యూఆర్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్లాట్‌ఫామ్‌పై అడుగు పెట్టడానికి వీలవుతుంది. లేదా ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

HDFC Dividend: షేర్ హోల్డర్లు లక్కీఛాన్స్: ఒక్కో షేర్‌పైHDFC Dividend: షేర్ హోల్డర్లు లక్కీఛాన్స్: ఒక్కో షేర్‌పై

ఓపెన్ లూప్ కాంటాక్ట్‌లెస్ కార్డ్ ఆధారంగా రూపొందించిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులను ప్రయాణికులు వినియోగించాల్సి ఉంటుందని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వెల్లడించింది. యూరోపే, మాస్టర్‌కార్డ్, విసా కార్డులను వినియోగించే వారు కామన్ మొబిలిటీ కార్డులతో అనుసంధానం పొందాల్సి ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్‌టీఎస్ అందుబాటులోకి వచ్చిన తొలిరోజు నుంచే ఈ వ్యవస్థ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

Delhi-Meerut RRTS will have an automatic fare collection system as well as QR code tickets

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా టికెట్లను జారీ చేయడంలో అత్యాధునిక వ్యవస్థను అమలు చేయనున్నట్లు పేర్కొందా కార్పొరేషన్. హైబ్రీడ్ యాన్యుటీ మోడెల్‌ను ప్రవేశపెట్టబోతోన్నామని స్పష్టం చేసింది. దీనికోసం అన్ని రకాల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు జారీ చేసే కార్డులతో తమ టికెటింగ్ వ్యవస్థను అనుసంధానిస్తామని తెలిపింది. వన్ నేషన్, వన్ కార్డ్ వ్యవస్థకు తాము శ్రీకారం చుట్టబోతున్నామని, దేశవ్యాప్తంగా ఇదే కార్డుల ద్వారా ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

English summary

ఢిల్లీ టు: ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్: హైబ్రీడ్ టికెట్ల వ్యవస్థ: కార్డులు, క్యూఆర్ కోడ్స్ | Delhi-Meerut RRTS will have an automatic fare collection system as well as QR code tickets

Delhi-Meerut RRTS corridor, the nation’s first Regional Rapid Transit System, will have an automatic fare collection (AFC) system as well as QR code tickets for passengers.
Story first published: Saturday, June 19, 2021, 14:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X