For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zomato Food Bill: బిల్లుల బాదుడుపై నెటిజన్ సీరియస్.. జొమాటో తీరు మార్చుకోవాలంటూ.. పోస్ట్ వైరల్..

|

Zomato Food Bill: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత చిన్న సమస్య అయినా సరే ప్రజలు అందరితోనూ పెంచుకుంటున్నారు. అలా రాహుల్ కబ్రా అనే ఒక లింక్డ్‌ఇన్ వినియోగదారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫుడ్ ఆర్డర్ బిల్లులను పోల్చుచూ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో వినియోగదారుల నుంచి ఎక్కువ వసూలు చేస్తోందని అతడు తెలిపాడు. ఈ క్రమంలో రెండింటి మధ్య షాకింగ్ ధరల వ్యత్యాసాన్ని గమనించారు. వినియోగదారుల నుంచి ఛార్జీల పేరుతో ఈ డెలివరీ కంపెనీలు భారీగా వసూలు చేస్తున్నాయని అతడు ఆరోపించాడు.

ఆర్డర్‌లో వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలు ఉన్నాయి. ఆఫ్‌లైన్ ఆర్డర్‌ బిల్లు CGST, SGST కలుపుకుని రూ.512 అయింది. ఇదే ఆర్డర్ జొమాటోలో రూ.75 డిస్కౌంట్ తర్వాత రూ.689.90 అయింది. ఆ క్రమంలో Zomto 34.76% ఎక్కువ (రూ.178) వసూలు చేసినట్లు లింక్డ్‌ఇన్ వినియోగదారు గమనించాడు.

customer compares zomato bill with offline bill found huge price gap got serious post going viral in linkedin

అధిక ఛార్జీల కట్టడి అవసరం..
దీనిపై వినియోగదారుడు రాహుల్ కాబ్రా.. "ఈ వ్యయ పెరుగుదలను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను, తద్వారా అందరికీ ఉపయోగకరంగా మారుతుంది" అని అన్నాడు. కస్టమర్ సముపార్జన ఖర్చుతో అన్ని స్టార్ట్-అప్‌లు ఇబ్బంది పడుతున్నాయని అభిప్రాయపడ్డాడు. కాలక్రమంలో వినియోగదారులు జొమాటో వసూలు చేస్తున్న అధిక ఖర్చులను అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులు క్రమంగా వారు జొమాటో సేవలకు దూరం అవుతారని అతను అన్నాడు.

నిరంతరం కంపెనీ చేస్తున్న ప్రకటనల ద్వారా అది ఎల్లప్పుడూ మా మదిలోనే ఉంటుందని ఆతను పేర్కొన్నాడు. భారతీయులు ఎల్లప్పుడూ ధర ప్రయోజనాన్ని పోల్చి చూస్తారని అన్నాడు. విలువకు తగినట్లుగా ధర చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉంటారని.. ఈ విషయాన్ని కంపెనీలు పరిగణలోకి తీసుకోవాలని అన్నాడు. ఇలా చేయటం వల్ల కంపెనీల రెనెన్యూ ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు వినియోగదారులు సంతోషంగా ఉంటారని అన్నాడు. దీనిపై మీ స్పందన ఏమిటో తెలపండి అంటూ సదరు వినియోగదారుడు కోరాడు..

customer compares zomato bill with offline bill found huge price gap got serious post going viral in linkedin

వినియోగదారులు ఏమంటున్నారంటే..
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. 7,600 కంటే ఎక్కువ మంది ఈ పోస్టుపై స్పందించగా, దాదాపు 1,000 మందికి పైగా కామెంట్లు చేశారు. మెుత్తానికి కంపెనీ ఇస్తున్న సర్వీసు వల్ల కొంత ఎక్కువ ఛార్జ్ చేస్తే తప్పేంటి, వారు చేస్తున్నదీ వ్యాపారమేగా అని కొందరు సమర్థిస్తుండగా. స్విగ్గీతో కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని మరొకరు కామెంట్ చేశారు.

ఇదే సమయంలో మరొక యూజర్ ఈ యాప్ లను ఫోన్ల నుంచి డిలీట్ చేసి మన పక్కనే ఉండే రెస్టారెంట్లకు వెళ్లి తినటం మంచిదని బదులిచ్చాడు. ఇలా యూజర్లు నెగటివ్ కామెంట్లతో పాటు తక్కువ నిబంధనలతో సేవలను అందిస్తున్న కంపెనీకి సానుకూలంగా కూడా స్పందిస్తున్నారు.

English summary

Zomato Food Bill: బిల్లుల బాదుడుపై నెటిజన్ సీరియస్.. జొమాటో తీరు మార్చుకోవాలంటూ.. పోస్ట్ వైరల్.. | customer compares zomato bill with offline bill found huge price gap got serious post going viral in linkedin

zomato customer serious over huge price gap between online and offline going viral ..
Story first published: Monday, July 4, 2022, 16:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X