For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST: సామాన్యులపై జీఎస్టీ పిడుగు.. ఖరీదుగా మారనున్న మాంసం, చేపలు, పెరుగు, పనీర్..

|

GST Meeting: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలు, యూటీల ప్రతినిధులతో కూడిన ప్యానెల్ రెండు రోజుల జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. దీనిలో కొన్ని సామాన్యులపై మోయలేని భారాన్ని మోపనున్నాయి. సోలార్ వాటర్ హీటర్లు, లెథర్ వస్తువులు, మిల్లింగ్ మెషినరీ, ఈ- వ్యర్థాలపై జీఎస్టీ రేటును భారీగా పెరిగాయి.

సామాన్యులపై జీఎస్టీ భారం..
ఈ క్రమంలో అనేక సిఫార్సులు ఆమోదించబడ్డాయి. ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేయబడిన మాంసం (except frozen), చేపలు, పెరుగు, పనీర్, తేనె, ఎండిన చిక్కుళ్లు, ఫాక్స్ నట్స్, గోధుమలు, తృణధాన్యాలు, గోధుమలు లేదా మెస్లిన్ పిండి, బెల్లం, పఫ్డ్ రైస్, సేంద్రియ ఎరువు, కొబ్బరి పిత్ కంపోస్ట్ లపై ఇకపై 5 శాతం జీఎస్టీ విధించబడనుంది.

Curd, paneer, other pre-packed & labelled food items falls under 5 percent gst from now

ఇకపై చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతుంది. ఇదే సమయంలో అన్ బ్రాండెచ్ వస్తువులు, ప్యాక్ చేయని ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపు కొనసాగనుంది. రోజుకు వెయ్యి రూపాయలకంటే ఎక్కువ ఖరీదైన హోటల్ గదులపై 12 శాతం టాక్స్ విధించబడనుంది.

Curd, paneer, other pre-packed & labelled food items falls under 5 percent gst from now

బెట్టింగులపై అధిక పన్ను..
కాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్, గుర్రాపు రేసులపై 28 శాతం పన్నుతో పాటు సీజీఎస్‌టీలో చేర్చబడిన సేల్స్ టాక్స్(వ్యాట్) వంటి పన్నుల నుంచి రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయానికి చెల్లించే పరిహారాన్ని పొడిగించాలనే డిమాండ్‌పై కౌన్సిల్ బుధవారం చర్చించే అవకాశం ఉంది. పరిహారం విధానాన్ని పొడిగించాలని లేదా GST రాబడిలో రాష్ట్రాల వాటాను ప్రస్తుత 50% నుండి 70-80%కి పెంచాలని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు డిమాండ్ చేశాయి.

English summary

GST: సామాన్యులపై జీఎస్టీ పిడుగు.. ఖరీదుగా మారనున్న మాంసం, చేపలు, పెరుగు, పనీర్.. | Curd, paneer, other pre-packed & labelled food items falls under 5 percent gst from now

necessities used by common people falls under 5 percent gst slab rate from now
Story first published: Wednesday, June 29, 2022, 10:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X