For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుంజుకుంటున్న క్రిప్టోకరెన్సీ: బిట్ కాయిన్ నుండి డోజీకాయిన్ వరకు...

|

క్రిప్టోకరెన్సీ దాదాపు స్థిరంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో 40,000 మార్కు దాటిన క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ నేడు 39,236 డాలర్ల వద్ద ఉంది. నేడు స్వల్పంగా లాభపడంతో క్రిప్టో మార్కెట్ క్యాప్ నేడు 716.79 బిలియన్ డాలర్లు పెరిగింది. మరో క్రిప్టో దిగ్గజం ఎథేరియం నేడు 5 శాతం మేర లాభపడి 2600 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎథేరియం క్యాపిటలైజేషన్ 300 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇతర కరెన్సీలు XRP, కార్డానో, డోజీకాయిన్, స్టెల్లార్, చైన్లింక్, యూనీస్వాప్, పోల్కాడాట్, పాలిగోన్, లైట్ కాయిన్ వంటివి కూడా లాభపడ్డాయి. గత ఇరవై నాలుగు గంటలుగా క్రిప్టో కరెన్సీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే...

Bitcoin - నేడు 38,132.02 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 1.08 శాతం లాభపడగా, $715.98 డాలర్ల మార్కెట్ క్యాప్ పెరిగింది. 24 గంటల్లో మార్కెట్ వ్యాల్యూమ్ $27.12 బిలియన్ డాలర్లుగా ఉంది.

Cryptocurrency prices today: virtual coins gain momentum

Ether - నేడు 2,607.36 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 5.33 శాతం లాభపడగా, $304.50 డాలర్ల మార్కెట్ క్యాప్ పెరిగింది. 24 గంటల్లో మార్కెట్ వ్యాల్యూమ్ $30.05 బిలియన్ డాలర్లుగా ఉంది.

Dogecoin - నేడు 0.196034 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 0.39 శాతం లాభపడగా, $25.60 డాలర్ల మార్కెట్ క్యాప్ పెరిగింది. 24 గంటల్లో మార్కెట్ వ్యాల్యూమ్ $964.21 బిలియన్ డాలర్లుగా ఉంది.

Litecoin - నేడు 138.09 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 0.88 శాతం లాభపడగా, $9.42 డాలర్ల మార్కెట్ క్యాప్ పెరిగింది. 24 గంటల్లో మార్కెట్ వ్యాల్యూమ్ $1.53 బిలియన్ డాలర్లుగా ఉంది.

XRP - నేడు 0.711522 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 1.88 శాతం లాభపడగా, $71.15 డాలర్ల మార్కెట్ క్యాప్ పెరిగింది. 24 గంటల్లో మార్కెట్ వ్యాల్యూమ్ $2.69 బిలియన్ డాలర్లుగా ఉంది.

Cardano - నేడు 1.36 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 2.15 శాతం లాభపడగా, $43.72 డాలర్ల మార్కెట్ క్యాప్ పెరిగింది. 24 గంటల్లో మార్కెట్ వ్యాల్యూమ్ $1.69 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇటీవల బిట్ కాయిన్ వ్యాల్యూ తగ్గినప్పటికీ, క్రిప్టో కమ్యూనిటీలో ఆశావాదం కనిపిస్తోందని, సెంటిమెంట్ సానుకూలంగా ఉందని, ఉన్నతస్థాయి సంస్థలు, వ్యక్తులు కూడా బిట్ కాయిన్ పైన పెట్టుబడులు పెడుతున్నారని, ఇప్పటికే కొనుగోలు చేసిన వారు కూడా అట్టి పెట్టుకుంటున్నారని క్రిప్టోకు చెందిన జెబ్‌పే ట్రేడ్ డెస్క్ చెబుతోంది. క్రిప్టోకు మద్దతు కొనసాగుతోందని, ఇటీవల పుంజుకోవడం, తాజాగా స్థిరంగా ఉండటం కూడా క్రిప్టో వృద్ధి కొనసాగింపుకు సంకేతాలుగా చెబుతున్నారు.

క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో సానుకూలత కొనసాగింపు కనిపిస్తోందని ముద్రెక్స్ కోఫౌండర్, సీఈవో ఎడ్యూల్ పటేల్ అన్నారు. బుల్స్ మరింత పుంజుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీ ఆల్ టైమ్ గరిష్టం 65000 డాలర్ల నుండి ఇటీవల 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. ఇప్పుడు మళ్లీ 40వేల డాలర్లకు చేరుకుంది.

English summary

పుంజుకుంటున్న క్రిప్టోకరెన్సీ: బిట్ కాయిన్ నుండి డోజీకాయిన్ వరకు... | Cryptocurrency prices today: virtual coins gain momentum

Bitcoin rose marginally after losing momentum a day ago. Bitcoin was trading at $38,129.53, up nearly 0.6 per cent. Bitcoin’s market capitalisation also rose to $716.79 billion.
Story first published: Thursday, August 5, 2021, 21:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X