For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

crypto prices today: సోలానా బిగ్ జంప్, బిట్ కాయిన్ 62,000 డాలర్లకు

|

మేజర్ క్రిప్టోకరెన్సీ సోమవారం కాస్త లాభపడింది. ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో ప్రారంభంలో ఎథేరియం, డోజీకాయిన్, యూనిస్వాప్ వంటివి నష్టపోయాయి. అయితే ఆ తర్వాత సాయంత్రానికి తిరిగి పుంజుకున్నాయి. అయితే బిట్ కాయిన్, షిబా ఇను, సోలానా మాత్రం లాభపడ్డాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.65ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే 2.26 శాతం లాభపడింది. మధ్యాహ్నం సమయానికి క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ రెండు శాతం లాభపడి 61,973 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,168 బిలియన్ డాలర్లకు చేరుకుంది. షిబా ఇను 12 శాతం, సోలానా 5 శాతం లాభపడ్డాయి. ఉదయం ఎథేరియం నాలుగు శాతం నష్టపోయింది.

సెకండ్ మేజర్ క్రిప్టో ఎథేరియం శుక్రవారం 4400 డాలర్ల పైన ట్రేడ్ అయింది. ఆ తర్వాత క్షీణించింది. నేడు నాలుగు శాతం పతనమైనప్పటికీ, తిరిగి పుంజుకుంది. అయినప్పటికీ మొన్నటి స్థాయికి చేరుకోలేకపోయింది. సాయంత్రానికి ఎథేరియం శాతం లాభపడి 4,319 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 5.29 శాతం లాభపడి 0.2,767 డాలర్ల వద్ద, లైట్ కాయిన్ 1.71 శాతం లాభపడి 193.64 డాలర్ల వద్ద, యూనిస్వాప్ 2.55 శాతం లాభపడి 25.26 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. స్టెల్లార్ 1.62 శాతం, ఎక్స్‌ఆర్పీ 0.89 శాతం నష్టపోయింది.

 crypto prices today: Solana gains 9%, Shiba Inu adds 7%

బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇటీవల 66వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 60వేల స్థాయికి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ 62,000 డాలర్లకు చేరుకుంది.

English summary

crypto prices today: సోలానా బిగ్ జంప్, బిట్ కాయిన్ 62,000 డాలర్లకు | crypto prices today: Solana gains 9%, Shiba Inu adds 7%

Major cryptocurrencies were on a downfall on Monday, thanks to profit booking in digital tokens. Barring Shiba Inu and Solana, seven out of the top 10 cryptocurrencies were trading lower at 9.30 hours IST. Shiba Inu soared 12 per cent, whereas Solana jumped 5 per cent. Ethereum shed 4 per cent.
Story first published: Monday, November 1, 2021, 22:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X