For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ మళ్లీ జంప్, 47,000 డాలర్ల పైకి: అవాలాంచే 6 శాతం అప్

|

క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు పెరిగింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు దాదాపు నాలుగు శాతం లాభపడింది. టాప్ టెన్ క్రిప్టో కరెన్సీలలో ఎక్స్‌పీఆర్, సోలానా మినహాయించి మిగతా 8 క్రిప్టోలు లాభపడ్డాయి. అవాలాంచే క్రిప్టో ఏకంగా 9 శాతం,టెర్రా, బిట్ కాయిన్ 4 శాతం చొప్పున లాభపడ్డాయి. న్యూమరో యూనో డిజిటల్ టోకెన్ బిట్ కాయిన్ 47,000 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. రెండో క్రిప్టో దిగ్గజం ఎథేరియం 4000 మార్కును క్రాస్ చేసింది. వారం రోజుల తర్వాత ఎథేరియం ఈ మార్కును దాటింది.

గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.21 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 23 శాతం పెరిగి 95.29 బిలియన్ డాలర్లుగా నమోదయింది. క్రిప్టో కాయిన్స్ నిన్న భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. బిట్ కాయిన్ నిన్న 46,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఎథేరియం, సోలానా, కార్డానో, పోల్కాడాట్ కూడా నష్టపోయాయి. కానీ నేడు ఎగిసిపడ్డాయి.

Crypto prices today: Bitcoin, Terra, Avalanche gain up to 9%

నేడు లాభపడిన వాటిలో బిట్ కాయిన్, బియాన్స్ కాయిన్, టెర్రా, అవాలాంచే ఉన్నాయి. అవాలాంచే ఏకంగా 6 శాతం వరకు ఎగిసింది. టెర్రా 4 శాతం మేర లాభపడింది. ఎథేరియం, టెథేర్ దాదాపు స్థిరంగా ఉంది. సోలానా, ఎక్స్‌పీఆర్ భారీగా నష్టపోయాయి.

English summary

బిట్ కాయిన్ మళ్లీ జంప్, 47,000 డాలర్ల పైకి: అవాలాంచే 6 శాతం అప్ | Crypto prices today: Bitcoin, Terra, Avalanche gain up to 9%

The cryptocurrency market was back in action with strong gains following a recent correction due to muted appetite for the riskier asset class. Rising inflation and hawkish tone of central banks has kept investors on their toes.
Story first published: Tuesday, December 21, 2021, 21:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X